దర్శకుడు అజయ్ సామ్రాట్ ఇంటర్వ్యూ
రుద్రంగి సినిమాను అద్భుతంగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: దర్శకుడు అజయ్ సామ్రాట్
జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన రుద్రంగి అనే సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రసమయి బాలకిషన్ నిర్మాతగా అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మణ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా
దర్శకుడు అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ జూలై 7న రుద్రంగి సినిమా రిలీజైంది. అన్నీచోట్ల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఏడాదిన్నర పాటు మేం కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు చాలా మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు.
నటుడు ఆశిష్ గాంధీ మాట్లాడుతూ సినిమాను ఇంత బాగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందులో అజయ్‌గారు నాకు మల్లి అనే పాత్రను ఇచ్చారు. నా క్యారెక్టర్‌ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సంతోష్‌గారి విజువల్స్‌కు మంచి పేరొచ్చింది. ఇది థియేటర్లో చూసే సినిమా. ప్రేక్షకులు మాకు ఇంకా సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాం అన్నారు.
డీ ఓ పి సంతోష్ మాట్లాడుతూ సినిమాను ఆడియెన్స్‌తో కలిసి చూస్తున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
నటుడు సదన్న మాట్లాడుతూ ఇందులో కరణం పాత్రలో నటించాను. పదికి పైగా సినిమాలు చేశాను. ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు వాళ్ల రెస్పాన్స్ చూసి నేనే యాక్ట్ చేసిందనిపించింది. అంత మంచి రోల్ ఇచ్చిన అజయ్ గారికి ధన్యవాదాలు. సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు.
నటి దివి మాట్లాడుతూ ఇందులో నేను ఫోక్ సాంగ్ చేశాను. దాన్ని వండర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. అజయ్గారితో మాట్లాడినప్పుడు స్పెషల్ సాంగ్ చేయాలా వద్దా అని కూడా ఆలోచించుకున్నాను. అయితే మా నిర్మాత రసమయి బాలకృష్ణగారు సాంగ్‌ను సేకరించారు. ఆ పాటను ఎలా చేస్తారోనని ఆలోచించాను. కానీ థియేటర్లో సినిమాను చూస్తున్నప్పుడు స్టన్ అయ్యాను. నన్ను అంత బాగా ప్రెజంట్ చేసిన అజయ్ గారికి థాంక్స్ అన్నారు.
నటి నవీన రెడ్డి మాట్లాడుతూ రుద్రంగి సినిమాను థియేటర్లోనే చూడాలి. రొటీన్‌కు భిన్నమైన సినిమా. రేర్‌గా వస్తుంటాయి. కొన్ని సంవత్సరాలు కష్టముంది అన్నారు.