Reading Time: 3 mins

దర్శకుడు పి మహేశ్ బాబు ఇంటర్వ్యూ

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒక యూనిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు పి.మహేశ్ బాబు.

న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ఫ్రెండ్స్ తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టికెట్ బుకింగ్స్ అనౌన్స్ మెంట్ చేయించారు. ఈ సందర్భంగా

హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు చూస్తుంటే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము సినిమాలో చెప్పబోతున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపించింది. కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. రీసెంట్ గా నేను మా సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టాండప్ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ ఇలా అన్ని చోట్ల ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాను. వారు మా సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 6న తేదీ నుంచి యూఎస్ టూర్ కు వెళ్తున్నాం. అక్కడి వివిధ స్టేట్స్ లో ప్రేక్షకుల్ని కలవబోతున్నా.

– జాతి రత్నాలు మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను. జాతి రత్నాలు సినిమా సక్సెస్ కు మ్యాచ్ అయ్యే మంచి మూవీ సెలెక్ట్ చేసుకోవాలని వేచి చూశాను. మహేశ్ ఈ కథ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్ లో కొద్ది సేపు ఉండిపోయా. అంత మంచి కథ ఇది. క్యారెక్టర్స్ కు వెయిట్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉంది. దాంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదలుపెట్టాం. ఈ సినిమాకు పూర్తి సమయం కేటాయించాలనే మరో సినిమా చేయలేదు. కోవిడ్ రావడం వల్ల నేను ఆలస్యంగా మూవీ చేసినట్లు అనిపిస్తుంటుంది.

– ప్రమోషన్ అనేది ప్రతి సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే బ్రిడ్జి లాంటిది. ఎవరు ప్రమోషన్ చేస్తున్నారనేది కాకుండా మా సినిమాను ఆడియెన్స్ దగ్గరకు ఎంత రీచ్ చేశామనేది ముఖ్యం. సినిమా షూటింగ్ టైమ్ లో నేను ఎవర్నీ కలవను. ఆ సినిమా ప్రపంచంలోనే ఉండిపోతాను. షూటింగ్ టైమ్ లో స్ట్రెస్ అవుతాం. కానీ ప్రమోషన్ టూర్ లో ఎంజాయ్ చేస్తుంటాను. ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ దగ్గర ఎంత దూరమైనా సినిమాను తీసుకెళ్తారు. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా మా మూవీ డేట్ కే వస్తోంది. నేను షారుఖ్ అభిమానిని. ఒక మిడిలి క్లాస్ యువకుడు ఎంత పెద్ద స్టార్ అవగలడు అనేది షారుఖ్ చూపించారు. నాకు ఆయన ఇన్సిపిరేషన్. మన ప్రేక్షకులు బాలీవుడ్, టాలీవుడ్ అన్ని సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ట్రైలర్ లో ఒక బోల్డ్ డైలాగ్ ఉంది. కానీ ఆ డైలాగ్ కు ఒక రీజన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అనుష్కతో కలిసి నటిస్తున్నా అని తెలిసినప్పుడు పైకి నేను పెద్దగా రెస్పాండ్ అవలేదు గానీ లోపల చాలా హ్యాపీగా అనిపించింది. అనుష్క గారి అరుంధతి సినిమా నా ఫేవరేట్ మూవీ. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉండేది. మేమే ఈ రెండు క్యారెక్టర్స్ ఎందుకు చేశామనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. మా సినిమా రిలీజ్ కు ఎక్కువ టైమ్ లేదు అందుకే మరికొన్ని ప్లేసెస్ కు వెళ్లలేకపోతున్నా. యూకే నుంచి ఇతర దేశాల నుంచి అడుగుతున్నారు రమ్మని. కానీ యూఎస్ టూర్ మాత్రమే వెళ్లగలుగుతున్నా.

– ఈ కథలో హీరోకున్న స్టాండప్ కామెడీ క్యారెక్టర్ నన్ను ఆకట్టుకుంది. స్టాండప్ కామెడీకి బయట చాలా డిమాండ్ ఉంది. ఈ ఆర్ట్ ఫామ్ ను ఎవరూ చిన్నచూపు చూడటం లేదు. తెలుగు ఆడియెన్స్ కు తెలుగు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని ప్రయత్నం చేశాం. రియల్ గా స్టాండప్ కామెడీ స్టూడియోస్ లో షూట్ చేశాం. స్టాండప్ కామెడీని కరెక్ట్ గా చేయాలని రీసెర్చ్ జరిపి, పక్కాగా చేశాం.

– దర్శకుడు, బ్యానర్, హీరో అన్నింటికంటే కథ అనేది ముఖ్యం. ఆ కథలో ఎమోషన్, మంచి క్యారెక్టర్స్, ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి. ఆ కథ మా సినిమాలో ఉంది. కాబట్టి మా డైరెక్టర్ సీనియరా, జూనియరా అనేది చూడలేదు. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది నాకూ, అనుష్క గారికి ఇంప్రెసివ్ గా అనిపించింది. నాగార్జున గారికి మా ట్రైలర్ చూపించాం. ఆయనకు నచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి 15వ కంటెస్టెంట్ గా వెళ్లాను. ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇవాళ అది టెలికాస్ట్ అవుతుంది. యూవీ సంస్థలో సినిమా చేస్తే ఆడియెన్స్ కు మరింత రీచ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తారని నమ్మాను.

– కథ బాగుండి, అందులే నాకు ఎగ్జైటింగ్ రోల్ ఉంటే తప్పకుండా మరో స్టార్ హీరోతో కలిసి చేస్తాను. చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్తారు. కానీ నేను అక్కడ సినిమా చేసి ఇక్కడికి వచ్చాను. మంచి కథ దొరికితే మళ్లీ హిందీలో నటిస్తా. ఇవాళ తెలుగు సినిమా స్టాటిటిక్స్ మారాయి. చాలా గ్రోత్ ఉంది. దానికి కారణం తెలుగు ఆడియెన్స్. వారు సినిమాలపై చూపించే ప్రేమే కారణం.

దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా మొదటినుంచీ సపోర్ట్ చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. రీసెంట్ గా కొన్ని షోస్ వేసుకుని చూశాం. ఆ షోస్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్ లో చదివా. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. మా ట్రైలర్ లో చూసింది 30 పర్సెంట్ అనుకుంటే సినిమాలో 70 పర్సెంట్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది. అన్నారు.