దర్శకుడు రాము కోన ఇంటర్వ్యూ
దర్శకుడుగా నాకు రాజమౌళి గారే ఆదర్శం : దర్శకుడు రాము కోన
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం రుద్రంకోట. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్ర, శక్తి, విభీష హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఐదు వేలకు పైగా సీరియల్ ఎపిసోడ్స్ కు డైరక్షన్ చేసిరుద్రంకోట చిత్రంతో చిత్ర దర్శకుడుగా పరిచయం అవుతోన్న రాముకోన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో..
మీ గురించి చెప్పండి?
నేను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా పద్మవ్యూహం కొన్ని రోజులు సీరియల్ కు పని చేశాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా మానేశాను. ఇలా కాదని మద్రాసు వెళ్లాను. అక్కడ మిత్రుడి ద్వారా డైరక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్ కు అసిస్టెంట్ డైరక్టర్ చేరాను. అలా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నా. ఆ తర్వాత ప్రామ్టర్ గా కొన్ని సీరియల్స్ కు పని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అన్ని మేజర్ టీవీ ఛానల్స్ లో హిట్ సీరియల్స్ డైరక్ట్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఎపిసోడ్స్ డైరక్ట్ చేశాను. జీ తెలుగుకి, మాటీవీకి సీరియల్ ప్రొడక్షన్ కూడా చేశాను. ఆ సమయంలోనే రుద్రంకోట సినిమా డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది.
రుద్రంకోట కథాంశం గురించి చెప్పండి?
రుద్రంకోట దగ్గర జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాము. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రం. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అండర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుంది.
నటీనటుల గురించి చెప్పండి?
ఇందులో లీడ్ రోల్ లో సీనియర్ నటి జయలలిత గారు నటించారు. కోటమ్మ పాత్రలో తను నటించిన తీరు అద్భుతం. అలాగే హీరోగా రుద్ర నటించాడు. తనకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా నటించాడు. అమ్మాయిలంటే గిట్టని పాత్రలో తను ఒదిగిపోయాడు. అలాగే హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది.
రుద్రం కోట చిత్రానికి మ్యూజిక్ కి ఎలాంటి ప్రాధాన్యత ఉంది?
ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. సుభాష్ ఆనంద్, నిరంజన్ ఇద్దరు సంగీత దర్శకులు. ఇటీవల టిప్స్ ఆడియో కంపెనీ లో పాటలు విడుదలై మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.
సీరియల్స్, సినిమాలకు మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి?
సీరియల్స్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నేను తెలియకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో మహిళకు నా సీరియల్ తెలుసు. కానీ సినిమా అలా కాదుఒక సినిమా హిట్ కొట్టామంటే మనకు కూడా మంచి ఫాలోయింగ్, పేరు వస్తుంది. సీరియల్ కు ఉండే కష్టం సినిమాకు ఉండదు.
ఏయే ప్రాంతాల్లో షూటింగ్ చేశారు?
అశ్వారావుపేట దగ్గర రుద్రంకోటఅనే విలేజ్ లో 26 రోజుల్లో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేశాము. సుచిత్ర చంద్రబోస్ గారు ఒక పాటకు కొరియోగ్రఫ్రీ చేయగా.. కీర్తి శేషులు శివ శంకర్ మాస్టర్ ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు క్లైమాక్స్ లో వచ్చే శివతాండవం పాటకు కొరియోగ్రఫీ చేశారు. మాస్టర్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. పాటలు వినడానికి ఎంత బావుంటాయో చూడటానికి అంతకన్నా బావుంటాయి.
సినిమాకు హైలెట్స్?
జయ లలిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత గారితో నేను చాలా సీరియల్స్ కు పని చేశాను. ఆ అభిమానంతో నేను తన పేరు సమర్పకురాలిగా వేసుకున్నాను. జయలలిత గారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు.
సినిమా రిలీజ్ ఎప్పుడు?
సెప్టెంబర్ 22న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
దర్శకుడుగా మీకు ఆదర్శం?
దర్శకుడు గా నాకు ఆదర్శం రాజమౌళి గారు. ఆయన కూడా మొదట శాంతి నివాసం అనే సీరియల్ చేసారు. ఆ తర్వాత సినిమాలు డైరక్ట్ చేసితెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చాను.
నటీనటులు :
సీనియర్ నటి జయలలిత, ఆలేఖ్య, బాచి, రమ్య
సాంకేతికవర్గం :
డిఓపీః ఆదిమల్ల సంజీవ్
సంగీతం : సుభాష్ ఆనంద్, నిరంజన్
ఎడిటర్ః ఆవుల వెంకటేష్
నిర్మాతః అనిల్ ఆర్కా కండవల్లి
స్టోరి-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రాము కోన