దసరా మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలు ఈ మధ్యన బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌కు చిరునామాగా మారిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతుల్ని, జీవనవిధానాల్ని వాస్తవిక కోణంలో కమర్షియల్ హంగులతో సిల్వర్‌స్క్రీన్‌పై ఆవిష్కరిస్తూ యువ దర్శకులు అద్భుత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన తాజా చిత్రం దసరా. నాని ఎంతగానో పబ్లిసిటీ చేసి హోరెత్తించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. సినిమా కథేంటి,వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ యేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్:
గోదావరి ఖని దగ్గరలోని వీరవల్లి అనే గ్రామంలో తొంభైలలో జరిగే కథ ఇది. చిననాటి స్నేహితులు ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అదే ఊళ్లో ఉన్న వెన్నెల (కీర్తిసురేష్) అంటే ధరణికి ఇష్టం. కానీ ఆమెతో సూరి ప్రేమలో ఉన్నాడని తెలుసుకొని , స్నేహం కన్నా గొప్పదేదీ లేదని తన ప్రేమను త్యాగం చేస్తాడు. వెన్నెలకి , సూరికి పెళ్లి అవుతుంది. మరో ప్రక్క ఆ ఊరి వాళ్లపై చిన నంబి (టామ్ చాకో) అధికారం చెలాయిస్తూంటాడు. తన ప్రెసిడెంట్ పదవి కోసం ఎంతకైనా దిగజారే రకం. అయితే అతనికో మరో బలహీనత ఉంటుంది. అది అమ్మాయిల పిచ్చి. ఇక అతని దృష్టి వెన్నెల పై పడుతుంది. దాంతో తనకు అడ్డుగా అనిపించే సూరిని చంపేస్తాడు. ఈ విషయం తెలిసిన ధరణి ఏం చేసాడు. ఆ ఊరికి చిన నంబి బెడద ఎలా వదిలించాడుదసరా అనే టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరిగింది అనేదే మిగతా కథ.
ఎనాలసిస్ :
ఇంతకు ముందులా కాదుఇప్పుడు అద్బుతమైన ,అరుదైన టెక్నీషియన్స్ పెద్ద సినిమాలకు లభిస్తున్నారు. దాంతో అదిరిపోయే అవుట్ ఫుట్ విజన్ ఉన్నవాళ్లు ఇవ్వగలుగుతున్నారు. అయితే కథ,కథనం లో మాత్రం టెక్నికల్ గా ముందడగు పడటం లేదు. బాగా పాత కథలను, రొటీన్ అనిపించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు. దాంతో ఎంత గొప్పగా విజువల్స్ ఉన్నా అందులోనే కథే మనస్సుని తాకుతుంది. కళ్లను దాటి సినిమా మెదడుకు చేరుస్తుంది. మనస్సులో భావోద్వేగాలు రైజ్ చేస్తుంది. అది కొత్త డైరక్టర్స్ మర్చిపోతున్నారు. ఎంతసేపూ కేజీఎఫ్ ని దాటాలి, ఆర్.ఆర్.ఆర్ ని దాటాలి అనుకుంటున్నారే కానీ అందులోని కథ,కథనాలను పట్టించుకోవటం లేదు. దసరాది అదే పరిస్దితి. నాని ఎంతో నమ్మి డైరక్టర్ కు స్వేచ్చి ఇచ్చి ప్రమోషన్స్ చేసిన ఈ చిత్రం చాలా భాగం బోర్ గా అనిపిస్తోందంటే అదే కారణం. ముఖ్యంగా సెకండాఫ్ అయితే అసలు కథే కదలదు. ఏ ఎమోషన్ కు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలో అర్దం కాదు. అలాగే ఎక్కడా రిలీఫ్ ఇవ్వరు. కేవలం రంగస్థలంని దగ్గర పెట్టుకుని తెలంగాణా ప్రాంతంలో జరిగే కథగా రెడీ చేసినట్లు అనిపిస్తుంది. ప్రెండ్షిప్, ప్రేమ, త్యాగ చుట్టూ కథను అక్కడక్కడే తిప్పుతూంటారు. వాటి నేపథ్యంలో మంచి భావోద్వేగాల్నే రాబట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే ఫస్టాఫ్ పై చేసిన కసరత్తు ఏదీ సెకండాఫ్ లో జరగదు. అలాగే విలన్ పాత్రను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. విలన్ స్ట్రాంగ్ గా ఉంటే కథ వేరేగా ఉండేది. రాజమౌళి ఈగ కూడా లో కూడా ఈ కథలో ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ అక్కడ ఉన్న గొప్పతనం ఏదీ ఇక్కడ కనపడదు. హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించాలనే తాపత్రయంలో మిగతా పాత్రలకు పనిలేకుండా చేసేసారు. పక్కా నాటుదనంతో కూడిన తెలంగాణలోని ఓ పల్లెటూరి కథ ఇది భావిస్తే నచ్చుతుంది. అంతే.
టెక్నికల్ గా :
కొత్త దర్శకుడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టెక్నికల్ గా మంచి పట్టు ఉన్నవాడే. దాంతో చాలా విజువల్స్ తెరపై అద్బుతంగా కనిపిస్తాయి. వాటి మధ్యలోంచి కథనే బయిటకు తీసి మన ముందుంచలేకపోయారు. ధరణిని వైల్డ్ గా చూపించాలనుకున్నాడు కానీ అందుకు తగ్గ విలన్ ని ,ఆ సెటప్ ని సమర్ధవంతంగా తీర్చిదిద్దలేకపోయాడు.సినిమాటోగ్రఫీ అదరకొట్టారు. సినిమాలో విజువల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో సీన్స్ ని ఎడిటర్ కాస్తంత చూసుకుంటే బాగుండేది. పాటలతో బాగానే మెప్పించిన సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. అయితే కొన్ని ఎలివేషన్ సీన్స్ లో డ్రాప్ అయ్యింది. డైలాగులు కాస్త అందరికి అర్దమయ్యేలా చూసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్ కు వస్తే :
ధరణి పాత్రలో నాని లుక్, యాక్టింగ్ కొత్తగా ఉన్నాయి. రగ్గ్‌డ్ క్యారెక్టర్‌లో నాని దుమ్ము రేపాడు. వెన్నెలగా కీర్తి సురేష్ కూడా చాలా బాగా చేసింది. ఆమె పాత్ర ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. సూరిగా కన్నడ నటుడు దీక్షిత్‌శెట్టి బాగానే లాగాడు. టామ్ చాకో విలనిజం అయితే కొత్తగాలేదు. సముద్రఖని, సాయికుమార్ లని డైరక్టర్ సరిగా వాడుకోలేదు. పూర్ణ పాత్రకు ఓ సీన్‌లో మాత్రమే డైలాగ్స్ ఉన్నాయి.
ప్లస్ లు :
ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్,
సినిమాటోగ్రఫీ
మైనస్ లు:
ప్రెడిక్టబుల్ గా సాగే కథ
స్లోగా సాగే సన్నివేశాలు
చూడచ్చా :
రా మరియు రస్టిక్ డ్రామా సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.
నటీనటులు :
నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు
సాంకేతికవర్గం :
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : విజయ్ చాగంటి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రన్ టైమ్ : 156 మినిట్స్
విడుదల తేదీ: 30-03-2023