Reading Time: < 1 min
దాడి పూర్తి కుటుంబ కథా చిత్రం
 
 
దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే ‘దాడి’.
 
సమాజంలోనే కాక దేశ యావత్తు జరిగే, జరిపే దాడుల వెనుకున్నకుట్రలనుఅదుపుచేసే ప్రయత్నమే మా ఈ  ‘దాడి’.  దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాలకోసం యువత భాద్యత కొరకు, కుటుంబ శ్రేయస్సు కొరకు భాద్యత గల యువకుడు చేసే పోరాటమే ఈ ‘దాడి’. అన్ని వర్గాలను మెప్పించే కథాంశంతో పాటు వినోదం, విలువలతో మంచి కుటుంబ చిత్రం ‘దాడి’ అన్నారు చిత్ర  దర్శకుడు తుమ్మ మధుశోభ. 
 
శ్రీ కల్ప వృక్ష సినీ క్రియేషన్స్ బేనర్ పై  ఆర్ల శంకర్ నిర్మాతగా  శ్రీరాం, గణేష్, జీవన్, అక్షర రెడ్డి, రూపిక, మీనాక్షి ప్రధాన పాత్రలలో తుమ్మ మధుశోభ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాడి’. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ ఆర్టిసులతో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 
శ్రీరాం, గణేష్, జీవన్, అజయ్ , కమల్ కామరాజ్,  అక్షరా రెడ్డి, రూపిక, మీనాక్షి, ప్రియ, సితార, ముకేశ్ ఋషి, చరణ్ రాజ్, మధు, సలీమ్ పాండ, నాగినీడు, ఈటీవీ ప్రభాకర్, అజయ్ గోషి, దిల్ రమేష్, సుదర్శన్, జబర్దస్త్ రాజమౌళి, చక్రి, ఐశ్వర్య, అలోక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 
 
డి.ఓ.పి :  ఎన్.వి రాఘవ, 
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు,
మ్యూజిక్ : మణిశర్మ,
ఫైట్స్ : వెంకట్, పృథ్వి శేఖర్,
కొరియోగ్రఫీ : శేఖర్, శివశంకర్,
డైలాగ్స్ : మల్లికార్జున్ ,
లిరిక్స్: కాసర్ల శ్యాం, భాష్యశ్రీ,
ఆర్ట్: వెంకటేశ్వర రావు
నిర్మాత : ఆర్ల శంకర్,
దర్శకత్వం : తుమ్మ మధుశోభ.