దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019
దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019 ఇన్విటేషన్, లోగో లాంచ్…. సెప్టెంబర్ 20న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేచింది. దాదాసాహెబ్ 150వ బర్త్ యానివర్శరీని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా చేయనున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించనున్నారు. ఈ అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ వేదిక కానుంది. సెప్టెంబర్ 20న ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ఈవెంట్ ఇన్విటేషన్ ను, అవార్డ్ ట్రోఫీని సీ స్పేస్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈవో అభిషేక్ మిశ్రా, సంస్థ ప్రతినిధులు వినయ్, యశ్… ఎంటర్ ప్రెన్యూర్ శ్రీధర్ రావ్, సీ స్పేస్ ప్రతినిథులు రాకేష్, పవన్ మరియు మిస్ ఇండియా 2013, సిమ్రన్ అహూజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈవో అభిషేక్ మిశ్రా మాట్లాడుతూ…. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ కృషి ఎంతో ఉంది. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్నో ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నాం. ఈనెల 20న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి దాదాసాహెబ్ ఫాల్కే మనవడు సి ఎస్ పుసాల్కర్ ముఖ్య అతిధిగా హాజరౌతుండడం విశేషం. వీరితో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు టాప్ సెలెబ్రిటీస్ హాజరౌతున్నారు. ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని ప్రధానమంత్రి కార్యాలయం (PMO)శుభాకాంక్షలు తెలియజేసింది. వీరితో పాటు ఫైనాన్స్, కార్పొరేట్ మంత్రి నిర్మలా సీతారామన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ హర్షవర్దన్, ట్రైబల్ ఎఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా, ఎంవోఎస్ ఐటీ, హెచ్ఆర్డీ కమ్యూనికేషన్ మినిస్టర్ సంజయ్ ధోత్రే, ఎంవోఎస్ స్టీల్ మినిస్టర్ ఫాగన్ సింగ్ కులస్తే, మహారాష్ట్ర ఫైనాన్స్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ సుధీర్, మహారాష్ట్ర హోం మినిస్టర్ రంజిత్ పాటిల్ శుభాశిస్సులు అందించారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ డెబ్యూట్ మేల్ ఫిమేల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, క్రిటిక్స్ ఫేవరేట్ యాక్టర్ మేల్ ఫిమేల్, హ్యుమానిటీ అంబాసిడర్, ఐకాన్ ఆఫ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, లైఫ్ టైం ఎచీవ్ మెంట్, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ మేల్ ఫీమేల్, ఔట్ స్టాండింగ్ ఫెర్ ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ మేల్ ఫిమేల్, స్టైల్ దివా ఇలా 15 కేటగిరీల్లో ఈ అవార్డులు అందించనున్నారు. ఈ ఈవెంట్ లో టాప్ సెలెబ్రిటీస్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అని అన్నారు.
శ్రీధర్ రావ్ ఎంటర్ ప్రెన్యూర్ మాట్లాడుతూ…. దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్ వేడుక హైదరాబాద్ లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి చేరడంలో తెలుగు సినిమా పరిశ్రమ కృషి ఎంతో ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు మన ఖ్యాతిని పెంచాయి. ఇక ఇప్పుడు సౌత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో చేసేందుకు సీఈవో అభిషేక్ మిశ్రా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.
ఇటీవలే బాలీవుడ్ లో ఈ అవార్డుల పండగ అద్భుతంగా జరిగింది. దీంతో హైదరాబాద్ లో జరగబోయే ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ సౌత్ అవార్డ్స్ వేడుక కోసం సినీలోకం ఎదురుచూస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో టాప్ సినీ సెలెబ్రిటీస్, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు, ప్రత్యేక అతిథులు పాల్గొంటున్నారు. దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి.
ఈ గ్రాండ్ ఈవెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే సినీ అభిమానులు కింది లింక్ ను క్లిక్ చేసి టికెట్స్ పొందొచ్చు.
https://in.bookmyshow.com/ events/dadasaheb-phalke- awards-south-2019/ET00108065
ఈ గ్రాండ్ ఈవెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే సినీ అభిమానులు కింది లింక్ ను క్లిక్ చేసి టికెట్స్ పొందొచ్చు.
https://in.bookmyshow.com/