దారే లేదా సినిమా వీడియో సాంగ్ విడుదల
నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియో సాంగ్ విడుదల.
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ కలిసి ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి ఇన్స్‌పైరింగ్‌గా సాగే ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించింది. ఈ రోజు (జూన్ 18) సాయంత్రం 4గంటల 32నిమిషాలకు ఈ సాంగ్ విడుదలైంది.
వృత్తి రిత్యా సత్యదేవ్, రూప డాక్టర్స్ కావడంతో ఉదయం షిప్ట్‌లో కార్తిక్(సత్యదేవ్), నైట్ షిఫ్ట్‌లో శృతి(రూప)
కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఇలా ఒక డాక్టర్స్ తమ వృత్తి కోసం, కోవిడ్ పెషంట్‌ల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో, ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందో అనేది ఈ పాటలో చాలా ఎమోషనల్‌గా చూపించారు. `మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్దం చేస్తున్న..శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. మేకింగ్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. అలాగే కేకే లిరిక్స్ అర్ధవంతంగా ఉండడంతోపాటు ఇన్స్‌పైరింగ్ గా ఉన్నాయి. విజయ్ బులగానిన్ సంగీతం ఈ పాటను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. తెలుగు, తమిళ భాషలలో ఈ పాట విడుదలై అందరినీ ఆలోచింపజేస్తుంది.
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ సాంగ్‌ను అంకితమిచ్చారు.