దాసరి ఫిల్మ్ అవార్డ్స్

Published On: May 5, 2022   |   Posted By:

దాసరి ఫిల్మ్ అవార్డ్స్

24 క్రాప్స్ట్ కి అవార్డ్స్ ఇచ్చిన దాసరి ఫిల్మ్ అవార్డ్స్.

9 మంది ప్రముఖులకు జీవన సౌఫల్య పురస్కారాలు.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 3 న దాసరి ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ప్రసాద్ లాబ్స్ లో వేడుక నిర్వహించారు.

దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యులు మరియు ఏబీసి ఫౌండేషన్ & వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగానిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీలో గల 24 క్రాప్స్ట్ టెక్నీషియన్లకి అవార్డ్స్ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ.

సీసీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అచ్చిరెడ్డి,డైరెక్టర్స్ రేలంగి నర్సింహరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో సుమన్ అతిథులు గా ఏర్పాటు చేసి 24 క్రాఫ్ట్స్ యొక్క టెక్నీషియన్లను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం పట్ల అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆనందానికి అవధులు లేవు.

ఈ సందర్భంగా స్టంట్ & ఫైట్స్ విభాగానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ… మేము ఆఫ్ స్క్రీన్ లో పడే కష్టాన్ని దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వారు గుర్తించడం మా అదృష్టంగా భావిస్తున్నాం,ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్ల కి , నిర్మాతలకు అవార్డ్స్ ఇచ్చారు కానీ వారు అలా కనిపించడానికి కష్ట పడే మా లాంటి కార్మికులే. మేము చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒక్కో సారి ప్రాణాలకి సైతం రిస్క్ ఉంటుంది. రిస్క్ చేసి మరీ కాళ్ళు చేతులు విరకొట్టుకున్న వారు మా యూనియన్ లో ఉన్నారు. అలాంటి మా యూనియన్ క్రాఫ్ట్స్ ని గుర్తించి ఇలా అతిధుల సమక్షంలో అవార్డ్స్ ఇవ్వడం
మాకు పద్మశ్రీ అవార్డ్స్ పొందిన అంత తృప్తిగా ఉంది అన్నారు.

ఇలా ఆర్ట్, సంగీతం, డైరెక్షన్, రైటింగ్, ఎడిటింగ్, కెమెరా, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెన్సీ, ప్రొడక్షన్ విభాగం, డబ్బింగ్ విభాగం వంటి అన్ని క్రాఫ్ట్స్ యొక్క ప్రెసిడెంట్, కోశాధికారి, ట్రెజరర్లకి అవార్డ్స్ ఇచ్చారు.

అలానే సినీ ప్రముఖులకి, సామాజిక వేత్తలకి, నాటక రంగం, పంపిణీ రంగం, సేవ రంగాల్లో ఉన్న కొంతమందికి దాసరి జీవన సౌఫల్య అవార్డ్స్ ని అందజేశారు.