Reading Time: 3 mins

దిక్సూచి మూవీ ఆడియో విడుద‌ల‌


బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసేశాడు.నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకొబొతొన్న ఆ కుర్రాడీ పేరు  దిలీప్‌కుమార్ స‌ల్వాది . దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఆడియోను బుధ‌వారం సాయంత్రం  ఆడియోను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో…

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌ద్మ‌నాభ్ః నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఆయ‌న నా మొద‌టి పాట  విని ఈయ‌నే నా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ అయ్యారు. అలాగే వాళ్ళ నాన్న‌గారు కూడా నాకు చాలా స‌పోర్ట్‌ని అందించారు.భ‌ర‌ద్వాజ్ నువు చెయి నీ వెనుక నేను ఉన్నాను అని అన్నారు.ఇది చాలా మంచి స్టోరీ అని అన్నారు. ముందుగా నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్‌గార్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మంచి మ్యూజిక్ చెయి అని స‌పోర్ట్ ఇచ్చిరు. ప్ర‌తి పాట నాకు ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చంది. బాంబే వెళ్ళి కైలాస్‌గారితో ఒక పాట పాడించాము. నేను మా లిరిక్‌రైట‌ర్‌గారు క‌లిసి వెళ్ళాము. అది ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇందులో డివోష‌న‌ల్‌, క్లాసిక‌ల్‌, క్రైమ్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. థ్యాంక్స్ టు మై డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్‌. రీరికార్డింగ్ కూడా డైరెక్ట‌ర్‌గారు, ప్రొడ్యూస‌ర్‌గారు ప‌క్క‌న ఉండి వాళ్ళ‌కు ఏ విధంగా కావాలో అలా చేయించుకున్నారు అన్నారు.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాంధీ మాట్లాడుతూ… దిక్సూచి సినిమాలో నాకు ఒక మంచి పాత్ర పోషించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు నా హృద‌య‌పూర్వ‌క  ధ‌న్య‌వాదాలు. నిర్మాత‌ల‌కు మ‌న డిఓపి క‌న్నాగారికి నాతో ప‌ని చేసిన‌వారంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.  ఈ సినిమా సూప‌ర్‌హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. దిలీజ్ గారు చాలా బాగా చేయించారు. 24 క్రాఫ్ట్స్‌లో దిలీప్‌గారికి చాలా మంచి అనుభ‌వం ఉంది. నిర్మాత‌ల‌కు క‌న‌క వ‌ర్షం కురిపించాల‌ని మ‌రో మంచి చిత్రం తీసి ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు. 

ధ‌న్వీ(చైల్డ్ ఆర్టిస్ట్‌) మాట్లాడుతూ… నేను 25 చిత్రాల్లో న‌టించాను. ఇది ఫుల్ లెంగ్త్ మూవీ. దిలీప్ అన్న‌య్య‌కి నా థ్యాంక్స్‌ ప్రొడ్యూసుర్ రాజు మాట్లాడుతూ… నేను నిర్మించిన మొద‌టి చిత్రం ఇది. నాకు చాలా కొత్త‌గా అనిపించింది. దిలీప్ స్టోరీ లైన్ చెప్పిన‌ప్పుడు నాకు ఏ మీ అర్ధం కాలేదు. సినిమా చూశాక అనిపించింది. నేనేనా ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేసింది అని. ఇక్క‌డకి వ‌చ్చిన వాళ్ళ‌ద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు  అని అన్నారు.

ఆర్టిస్ట్‌ అరుణ్ మాట్లాడుతూ… దిక్స‌చి చిత్రంలో నేను మంచి పాత్ర చేశాను (విల‌న్ పాత్ర‌). ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు దిలీప్‌కు థ్యాంక్స్‌. అవ‌కాశం వ‌చ్చేలా చేసినందుకు నా వైఫ్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకి క‌ర్త‌, క్రియ‌, క‌ర్మ అంతా దిలీప్‌. చాలా బాగా చేశారు. రాత్రిప‌గ‌ళ్ళు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. వాళ్ళ పేరెంట్స్‌కూడా చ‌లా స‌పోర్ట్ చేశారు. అదే విధంగా మా ప్రొడ్యూస‌ర్ గారు కూడా చాలా స‌పోర్ట్ ని అందించారు. అంద‌రూ కొత్త‌వాళ్ళ‌తో న‌టించాను అంద‌రి ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాను. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌. డిఓపిగారికి థ్యాంక్స్ అని అన్నారు.

సుమ‌న్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ… దిలీప్ కంటే ఈ సినిమాకి వాళ్ళ పేరెంట్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. దిలీప్ కి కూడా క‌ష్ట‌ప‌డ్డారు. దిలీప్ థ్యాంక్స్ అవ‌కాశం ఇచ్చినందుకు నా కో-స్టార్స్‌కి కూడా థ్యాంక్స్‌, ప్రొడ్యూస‌ర్‌గారికి కూడా చాలా థ్యాంక్స్ ఈ రోజుల్లో ఎన్ఆర్ ఐలు ప్రొడ్యూస్ చెయ్య‌డం అంటే చాలా ఆలోచిస్తారు. కాని రాజు గారు చాలా డిఫ‌రెంట్ జోన‌ర్‌ని తీసుకుని దిలీప్‌ని ఎంక‌రేజ్ చేశారు. దిలీప్ ఆల్‌రౌండ‌ర్‌.  దిలీప్ మై ఫ‌స్ట్ టీచ‌ర్ అని అన్నారు.

చాందిని మాట్లాడుతూ… నేను చాలా మందికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. నాకు ఈ చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దిలీప్ చాలా థ్యాంక్స్‌. బ్యూటిఫుల్ టీమ్‌.ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక‌ళ్ళు క‌ష్ట‌ప‌డ్డాం కాని ఎవ్వ‌రికీ ఆ క‌ష్టాన్ని క‌నిపించ‌కుండా దిలీప్ వాళ్ళ నాన్న‌గారు చాలా బాగా చూసుకున్నారు.  టీజ‌ర్ అంద‌రికి న‌చ్చిందని అనుకుంటున్నాను. రాజుగారు నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.  అంద‌రం ఒక ఫ్యామిలీలాగా ఈ సినిమాని చేశాం అన్నారు. మా నాన్న‌గారు కూడా ఈ చిత్రంలో ఒక  పాత్ర చేశారు. థ్యాంక్ యూ పాపా. అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి మ‌మ్మ‌ల్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో క‌మ్ డైరెక్ట‌ర్ దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ… చాలా మంది న‌న్నుఆడియో ఫంక్ష‌న్ అన‌గానే  ఏమి అడుగుతున్నారు అంటే. గెస్ట్ ఎవ‌రు అని? నాకు ఎవ్వ‌రూ గెస్ట్ వ‌ద్దు ఆడియ‌న్సే నా గెస్ట్‌లు.  రాజ్‌గారు గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు. ఇంత కాలం ఇండ‌స్ర్టీలో ఉండి ఏమీ చెయ్య‌లేదా అంటే క‌థ‌లు వ‌స్తున్నాయి చేస్తున్నా కాని ప్రోప‌ర్ క‌థ రావ‌టం లేదు  టైంరావాలి అన్నా. స‌రే నేను నీకు టైం ఇస్తా తీసుకో అన్నారు. తీసుకున్నా అదే దిక్సూచి వ‌ల్గారిటీ లేని చిత్ర‌మిది.  సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఫ్యామిలీతో వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఇది.సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. చాలా నీట్‌గా థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌గా ఉంటుంది. న‌న్ను స‌పోర్ట్ చేసిన అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.  మా అమ్మ‌, నాన్న న‌న్ను చాలా  స‌పోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా కోసం చ‌చ్చిపోతాం. అలాంటి ఫ్యామిలీ మాది. మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఇండ‌స్ర్టీలో టీమ్ వ‌ర్క్ చేసేది చాలా త‌క్కువ మంది. మా నందు కో డైరెక్ట‌ర్ నాతో చివ‌రి వ‌ర‌కు ట్రావెల్ అయ్యారు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.  ఈ సినిమా చూసి అంద‌రూ న‌న్ను ఒక స‌పోర్ట్ చెయ్యండి. దిక్స‌చి ఫౌండ‌నేష‌న్ కూడా స్టార్ట్ చేశాను. రాజు అన్న చాలా థ్యాంక్స్ అని అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంఃదిలీప్ కుమార్ స‌ల్వాది, ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాఃజ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మన‌వ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది క‌ట్స్ః దిక్సూచి స్టూడియోస్‌