ది ఛేజ్ మూవీ టీజర్ రిలీజ్
ఎమోషనల్ థ్రిల్లర్ ‘‘ది ఛేజ్’’ టీజర్ రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ
తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’
అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో
ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు.
తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’
మెయిన్ లీడ్ గా ‘‘ది చేజ్’’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని
రూపొందిస్తున్నాడు. అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం.అలాగే
మోనిక,సత్యం రాజేశ్,హరీష్ ఉత్తమన్,మధునందన్ ఇతరు ప్రధాన పాత్రల్లో
నటిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరినీ
ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లింగ్ గా ఉంది టీజర్. హీరో విజయ్
సేతుపతి,హీరోయిన్ రెజీనా ఈ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ
రిలీజ్ కు రెడీ గా ఉంది.మంచి డేట్ చూసుకుని తెలుగు,తమిళ భాషల్లో మూవీని
రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్.
నటీనటులు:
రైజా విల్సన్
అనసూయ
మోనిక
సత్యం రాజేష్
హరీష్ ఉత్తమన్
మధునందన్.
టెక్నీషియన్స్:
సినిమాటోగ్రాఫర్ : వేల్ రాజ్
యాక్షన్ కొరియోగ్రాఫర్ : దిలీప్ సుబ్బరాయన్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్యామ్ సి.ఎస్
ఎడిటర్ : సాబు జోసెఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స,ప్రభా చింతలపాటి
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన,దర్శకత్వం: కార్తీక్ రాజు