ది వ్యాక్సిన్ వార్ మూవీ సెప్టెంబర్ 28 విడుదల
వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, యామ్ బుద్ధ ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ది వ్యాక్సిన్ వార్ సెప్టెంబర్ 28న విడుదల
విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ ని రూపొందిస్తున్నారు, ఇది దేశంలో COVID-19, వ్యాక్సిన్ డ్రిల్ల్స్ గురించి కొన్ని అధ్యాయాలను చూపనుంది. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.
దర్శకుడు చిన్న గ్లింప్స్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఇది ల్యాబ్‌లో కోవిడ్-19 కోసం క్లినికల్ ట్రయల్స్ చూపిస్తుంది. పల్లవి జోషి సైంటిస్ట్‌గా కనిపించగా, గ్లింప్స్ నానా పటేకర్ పాత్రను కూడా పరిచయం చేసింది.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తునారు. ఇంతకుముందు ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అసోషియేషన్ లో వున్నారు.
వ్యాక్సిన్ వార్ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10+ భాషల్లో విడుదల కానుంది.