దీపావళి మూవీ కి నిర్మాత దిల్ రాజు ప్రశంసలు
దీపావళికి దిల్ రాజు ప్రశంసలు – స్పెషల్ ప్రీమియర్ వీక్షించిన అగ్ర నిర్మాత
ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ నిర్మించిన సినిమా దీపావళి. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కిడకు తెలుగు అనువాదం ఈ దీపావళి. ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ వీక్షించిన అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాపై ప్రశంసలు కురిపించారు. దిల్ రాజుతో పాటు మీడియా ప్రతినిధులు సైతం స్పెషల్ ప్రీమియర్ చూశారు.
సినిమా చూసిన తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో దీపావళి పండక్కి దీపావళి విడుదల అవుతోంది. స్రవంతి రవికిశోర్ గారు ఎంతో ఇష్టపడి, నచ్చిన కథను స్క్రీన్ మీదకు తీసుకు వచ్చారు. ముందుగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన సినిమా. ఒక మేక గురించి సినిమా తీశారు. చిన్న పిల్లవాడికి, మేకకు మధ్య అనుబంధాన్ని చూపిస్తూ రెండు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టారు. అది అంత ఈజీగా కాదు. డిఫరెంట్ సినిమా చూడాలని కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి అని అన్నారు.
స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ మా దీపావళి స్పెషల్ ప్రీమియర్ చూడటంతో పాటు సినిమాను అప్రిషియేట్ చేసిన దిల్ రాజుకు థాంక్స్. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల చేస్తున్నాం. దీపావళి పండగ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, అందులో భావోద్వేగాలు ప్రతి ఒక్కరి మనసును తాకుతాయి అని చెప్పారు.
దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో దేవుడికి మొక్కిన మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు. భాయ్ దగ్గర ఉద్యోగం మానేసి కొత్తగా మటన్ షాప్ పెడతానని భాయ్ (ఓనర్) కుమారుడితో సవాల్ చేసిన వీరాస్వామి ఆ మేక కొనడానికి డబ్బులు ఇస్తాడు. దొంగలు ఆ మేకను తీసుకు వెళ్లడంతో ఆ తర్వాత ఏమైందనేది వెండితెరపై చూడాలి.
నటీనటులు :
పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి
సాంకేతికవర్గం :
ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్
సంగీతం : థీసన్
సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్
సమర్పణ : కృష్ణ చైతన్య
నిర్మాత : స్రవంతి రవికిశోర్
దర్శకత్వం: ఆర్ఏ వెంకట్