దుర్గామతి ది మిత్ మూవీ రివ్యూ
మతి లేని…: ‘దుర్గామతి ది మిత్’ రివ్యూ
Rating:1.5/5
సౌత్ లో హిట్టైన సినిమాలు హిందీలో రీమేక్ చేయటం ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రెండ్ కాదు కానీ ఈ మధ్యన బాగా ఊపందుకుంది. ఎప్పుడెప్పుడువో పాత సినిమాలు రైట్స్ కొని …మన డైరక్టర్స్ నే తీసుకెళ్ళి డైరక్షన్ చేయిస్తున్నారు. ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్..ఇప్పుడు అక్షయ్ కుమార్ అలాంటి సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. భాక్సాఫీస్ వద్ద బాంబ్ లా పేలిన లక్ష్మీ బాంబ్ అక్షయ్ చేసిన సౌత్ రీమేక్. తను నటించటమే కాదు సౌత్ సినిమాల మీద ఉన్న నమ్మకంతో ఆయన పెట్టుబడి కూడా పెడుతున్నారు. అలా చేసిన చిత్రమే తెలుగులో వచ్చిన భాగమతి రీమేక్ దుర్గామతి. ఏముంది భాగమతి లో అంత రీమేక్ చేసేందుకు అనే ఆలోచన తెలుగు వాళ్లకు కలగవచ్చేమో కానీ …నార్త్ లో మాత్రం హిట్ సినిమాని రీమేక్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకానీ ఏ కారణంతో రీమేక్ అయ్యిందనే విషయం వాళ్లకు అనసరం. ఇలాంటి నేపధ్యంలో చేసిన ఈ దుర్గామతి చిత్రం ఏ మేరకు మనవాళ్లను ఆకట్టుకుంటుంది. అనుష్కను భాగమతి చూసిన కళ్లతో మరొకరుని ఆ పాత్రలో చూడగలరా..అలాగే హిందీ నేటివిటీకి తగినట్లు ఏ మార్పులు చేసారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్…
ఐఏఎస్ ఆఫీసర్ చంచల్ చౌహన్ (భూమి పెర్నాండెజ్) తన ఫియాన్సి శక్తి(కరన్ కపాడియా) మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. ఆమెను ఇంటరాగేట్ చేయటానికి సిబీఐ జాయింట్ డైరక్టర్ శతాక్షి గంగూలి (మహీ గిల్) సిద్దపడుతుంది. అయితే ఇలా ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారనే విషయం బయిటకు పొక్కితే ప్రమాదమని బావించి ఎక్కడో ఊరికి చివరగా ఓ బూత్ బంగ్లాలాంటి భవంతి దుర్గా మహల్ లో చంచల్ ని తీసుకెళ్ళి పెడతారు. అలాగే ఈ ఇంటరాగేషన్ లో చనిపోయిన శక్తి సోదరుడు ఏసిపి అజయ్ సింగ్ (జిషు సేన్ గుప్త) సైతం ఎంటర్ అవుతారు. వాళ్లందిరకి ఎవరి హిడెన్ ఎజెండాలు వాళ్లకు ఉంటాయి. చంచల్ గతంలో ఉద్యోగ నిర్వహణలో భాగంగా వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్(అర్షద్ వార్శి)అనే ఓ నిజాయితీ గల పొలిటీషన్ తో పది సంవత్సరాలు పనిచేసి ఉంటుంది. దాంతో ఆయన్ను టార్గెట్ చేద్దామనుకునే వాళ్లు సైతం…ఈమె ద్వారా ఆయనకు సంభందించిన కొన్ని సీక్రెట్స్ లాగాలని ప్రయత్నాలు మొదలెడతారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో ఉన్నప్పుడు అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ మహల్ లోకి ఎంటర్టైన నాటి నుంచి చంచల్ కి భయపెట్టే సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఉన్న దుర్గామతి ఆత్మ ఆమెను ఆవహిస్తుంది. అప్పుడేం జరిగింది. అసలు దుర్గామతి ఎవరు ..ఆమె ఆత్మగా ఎందుకైంది…అలాగే ఈశ్వర్ ప్రసాద్ పాత్ర ఈ కథలో ఏమిటి..చివరకు వాళ్లదిరి ఎత్తుల..పై ఎత్తుల నుంచి చంచల బయిటపడగలిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ
ఈశ్వర్ ప్రసాద్ (అర్షద్ వార్సీ) ఓ నిజాయితీ గల మంత్రి..మాస్ లీడర్. అయితే ఇలా ఇంత పేరు తెచ్చుకోవటం ఆయనతో తిరిగే వాళ్లలో చాలా మందికి నచ్చదు. ఎలాగైనా ఆయన్ను క్రిందకి దింపాలని,రోడ్డుపై పెట్టాలని ప్లాన్ చేస్తూంటారు. ఇందుకోసం వాళ్లు సీబీఐ ఆఫీసర్ శతాక్షి గంగూలి(మహిగిల్)ని ఆశ్రయిస్తారు. ఆమె ఈశ్వర్ ప్రసాద్ ని బీహార్ లోని పురాతన విగ్రహాల మాయం కేసులో ఇరికించాలనుకుంటుంది.అందుకోస్ం ఆయనతో పదేళ్లపాటు పనిచేసిన మాజీ సలహాదారు..చంచల చౌహాన్ ఐఏఎస్ (భూమి పెర్నాండెజ్) ని ఇంటరాగేట్ చేయాలనుకుంటుంది. చంచల ఆల్రెడీ జైల్లో ఉంది. అయితే చంచల్ ని సీక్రెట్ గా మాత్రమే ఇంటరాగేట్ చేయాలని ఊరికి దూరంగా,వెలివేసినట్లుంటే దుర్గా మహల్ కు తీసుకువస్తారు. అయితే అక్కడే ఓ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. భయపెట్టే సంఘనటలు జరుగుతూంటాయి. అక్కడే ఉన్న దుర్గామతి ఆత్మ…చంచలని ఆవహిస్తుంది. అక్కడ నుంచి కథ ఏ మలుపు తీసుకుంటుంది. అసలు దుర్గావతి ఆత్మ ఎందుకు చంచలను ఆవహించింది…దుర్గామతి కథేంటి…ఈశ్వర్ ప్రసాద్ చివరకు ఏమయ్యారు.. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…
తెలుగు భాగమతి ని ప్రక్కనపెట్టి ఈ సినిమా గురించి మాట్లాడకోలేము. ఖచ్చితంగా పోలిక వస్తుంది. ఇక దుర్గామతిని ఈ సినిమాని నార్త్ అంతటా కూడా ఓ హారర్ సినిమాగా పబ్లిసిటీ చేసారు. అయితే సినిమా ఫస్టాఫ్ లో అక్కడక్కడా తప్ప ఆ ఛాయిలు కనపడవు. దుర్గామతి ఆత్మ ఆవహించిన ఆ కాసేపు సినిమాలో హై ఓల్టోజీ ప్రవహించాలి. అయితే అది జరగలేదు. పాత కాలం హారర్ సినిమాల్లో వాడిన ట్రిక్ లే ఇందులో వాడటం సమస్యను తెచ్చిపెట్టింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సోషల్ మెసేజ్ కోసం మిగతా సినిమా అంతా బలిపెట్టారనే ఫిలింగ్ వస్తుంది. అందుకు సగం కారణం భూమి ఫెర్నాండెజ్ నటనలో ఆ స్పార్క్ కనపడకపోవటమే. సన్నిడియోల్ చేసిన పాత్రలో అమోల్ పాలేకర్ చేసినట్లు అనిపించింది. అంతలా భూమి తేలిపోయింది. ఆమెను తెలుగు సినిమాలో అనుష్క హావభావాలు యాజటీజ్ ఫాలో అవ్వమని చెప్పినట్లున్నారు. అదే చేసి తన స్వంత మార్క్ ని మిస్సైంది. అంతేకాకుండా తెలుగు భాగమతి ..సాధారణంగా హిందీకి వెళ్లగానే అక్కడ నేటివిటి అద్దుకుటుందని భావిస్తాము. కానీ దుర్గామతి లో అదేమీ కనపడదు. అంతేకాకుండా కథా నేపధ్యం అయిన పొలిటికల్ ఇష్యూస్..మన సౌతిండియాకు చెందినవి. నార్త్ రాజకీయాలు పూర్తిగా వేరు. అది పట్టించుకోలేదు. దాంతో స్క్రిప్టు బాగా మూసగా మారిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ అప్పీల్ ఉన్న నటి ఆ పాత్రను చేస్తే బాగా నప్పేది. మనకు ఇక్కడ అనుష్క కు ఉన్న స్టార్ ఇమేజ్ క్యారక్టర్ కు,కథకు కలిసొచ్చింది. భూమి లో ఆ ఛరిష్మా లేదు. కేవలం ఆమె మంచి నటి మాత్రమే. దాంతో సినిమా సరైన నేటివిటీ లేక…స్టార్ ఇమేజ్ తోడవక..జీవం లేకుండా అలా సీన్స్ వచ్చి పోతున్నట్లు అయ్యింది. కాంచన రీమేక్ కు అక్షయ్ కుమార్ ఎక్కువైనట్లు..ఇక్కడ భూమి ఈ పాత్రకు తక్కువైంది.
టెక్నికల్ గా..
స్క్రిప్ట్ ఈ సినిమాకు సహకరించకపోవటంతో మొదట మైనస్ అక్కడే జరిగింది. డైరక్టర్ అశోక్ కూడా ఎంతసేపూ తెలుగులో ఎలా ఉందో అదే జెరాక్స్ తీసేస్తే సరిపోతుందన్నట్లు షాట్స్ దగ్గర నుంచి క్యారక్టర్స్ పేర్లు దాదాపు అలాంటివే వాడారు. ఇదేమీ డైరక్టర్ కు హిందీలో మరిన్ని సినిమాలు తెచ్చే పెట్టే ప్రాజెక్టు కాదు. పాటలు బాగానే ఉన్నాయి. కానీ ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోయాలి. కానీ అదే మైనస్ గా సాగింది. కులదీప్ సినిమాటోగ్రఫీ ..చెప్పుదగిన రీతిలో విజువల్స్ ని అందించలేకపోయింది. ఏదో టీవి సినిమా చూస్తున్న ఫీల్ తీసుకొచ్చింది. ఉన్ని కృష్ణన్ ఎడిటింగ్ బాగుంది. రైటింగ్ డిపార్టమెంట్ సరిగ్గా వర్కవుట్ చేసి ఉంటే మంచి ప్రాజెక్టు అయ్యేది. ట్రాన్సలేషన్ క్రింద కాకుండా ఓ చక్కటి ఎడాప్షన్ లా చేసి ఉంటే బాగుండేది.
చూడచ్చా…
భాగమతి చూసిన వాళ్లు ఈ సినిమా చూస్తే బాగా డిజప్పాయింట్ అవుతారు.
ఎవరెవరు
నటీనటులు:భూమి పెడ్నేకర్, అర్షద్ వర్షి, జిష్షు షేన్ గుప్త
సంగీతం: జేక్స్ బెజోయ్
సినిమాటోగ్రఫీ: కులదీప్
ఎడిటర్: ఉన్నికృష్ణన్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత :విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్, అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్
రన్ టైమ్:2 గంటల 35 నిముషాలు
విడుదల తేదీ:డిసెంబర్ 11, 2020
ఓటీటి: అమేజాన్ ప్రైమ్ వీడియో