దేవ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక
ఘనంగా కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ ల ‘ దేవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న ఈ సినిమా విడుదల అవుతుండగా, రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యింది.
దర్శకుడు రజత్ రవిశంకర్ మాట్లాడుతూ..
దేవ్ సినిమా లో హీరో క్యారక్టర్ అందరికి పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది.. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ గారికి , తెలుగులో రిలీజ్ చేస్తున్న ధన్యవాదాలు.. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి..అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ , యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి..ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన నా టీం కి కృతజ్ఞతలు..హారిస్ జయరాజ్ గారు మ్యూజిక్ చాల బాగా ఇచ్చారు.. అందరి కృషి తోనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.. సినిమా కి పనిచేసిన అందరి టెక్నిషియన్స్ కి చాల థాంక్స్ అన్నారు..
నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ
కార్తీ తో చాల రోజుల నుంచి అనుబంధం ఉంది. కార్తి లాంటి హీరో తో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా చేస్తున్నందుకు హ్యాపీ గా ఉంది. ఈ సినిమా కి పనిచేసిన అందరికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి చాల మంది పనిచేశారు. హీరోయిన్ రకుల్ చక్కని అభినయం కనపరిచింది. దర్శకుడు రజత్ స్క్రిప్ట్ లో ఎం చెప్పాడో స్క్రీన్ లో అదే చూపించాడు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయన. మ్యూజిక్ చాల బాగుంది. హారిస్ జయరాజ్ గారు వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి చాల చాల థాంక్స్ అన్నారు..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ
ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చిన ప్రతి సారి మీ రెస్పాన్స్ చూస్తే చాల సంతోషంగా ఉంది.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన. చాల పవర్ ఫుల్ రోల్. ఇండిపెండెంట్ వుమన్ క్యారెక్టర్.మీ అందరికి నా పాత్ర నచ్చుతుంది. ముందుగా నాకు ఈ పాత్ర ఇచ్చిన అందరికి చాల థాంక్స్. ఖాకీ టైం లోనే కార్తీ తో మంచి అనుబంధం ఏర్పడింది. మళ్ళీ ఈ సినిమా కూడా ఖాకీ లాగే మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. డైరెక్టర్ రజత్ గారు మంచి టాలెంటెడ్ డైరెక్టర్. కొత్త డైరెక్టర్ లాగ ఎక్కడా అనిపించలేదు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ని పండించారు. ఆయనకు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. లక్ష్మణ్ గారు చాల సపోర్ట్ చేశారు. నిర్మాత గా ఎం చేయాలో అన్ని చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికి చాల థాంక్స్. అందరు ఫిబ్రవరి 14 న సినిమా చూడండి.. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది. తప్పకుండ ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ
అందరికి నమస్కారం. ప్రజెంట్ జనరేషన్ మూవ్ అవుతున్న జోనర్ లో ఓ సినిమా చేయాలనుకున్నాను. దేవ్ సినిమా ఇప్పటి జనరేషన్ లో ఉన్న వారికి సరిగ్గా సూట్ అవుతుంది. చాల అందమైన కథ దేవ్ సినిమా. ఈ సినిమా కి అందరు కనెక్ట్ అవుతారు. లవ్ అండ్ ఫ్రెండ్షిప్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలోని మేఘన పాత్రకు రకుల్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల లవ్ ఎలాంటి ఫ్రాబ్లమ్స్ ఎదురయ్యయనేదే సినిమా కథ. హారిస్ జయరాజ్ గారు మంచి సంగీతం ఇచ్చారు.ముఖ్యంగా ఎస్పీబీ గారు పాడిన పాట సినిమా కే హైలైట్.రకుల్ నా కాంబినేషన్ మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తుంది. రజత్ ఈ సినిమా కి ప్రాణం పెట్టాడు. చాల కష్టపడ్డాడు. ఈ సినిమాలో నటించిన అందరు చాల బాగా నటించారు. డిఫరెంట్ కథ చేసిన ఫీలింగ్ ఉంది నాకు. కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో మీ అందరిని కలుస్తాను అన్నారు..