దేవ్ మూవీ రివ్యూ

Published On: February 15, 2019   |   Posted By:

దేవ్ మూవీ రివ్యూ

వద్దేవ్  – ‘దేవ్’ మూవీ రివ్యూ

Rating: 1.5/5

అనగనగా ఓ దేవ్ (కార్తి). కోటీశ్వరుడు అయిన అతనికి సాహసాలంటే తెగ ఇష్టం. ఎవరెస్ట్ ఎక్కాలన్నది జీవితాశయం.  అతన్ని సాహసాల నుంచి సరదా లైఫ్ కు తీసుకురావాలని ఫ్రెండ్స్ (విఘ్నేష్, నిషా) కంకణం కట్టుకుని ప్రేమలో పడితే మారతాడని అందుకు ఫేస్ బుక్ సరైన వేదిక అని నమ్మి ఫ్రొఫైల్స్ వెతుకుతారు. 
 

ఈ కథకు మరో ప్రక్క  మేఘన (రకుల్)కు బిజినెస్ తర్వాతే ఏదైనా. అది ప్రేమైనా. మగాళ్లైనా మరేదైనా. పాతికేళ్లకే బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అవుతుంది. తన చిన్నప్పుడు తల్లి జీవితంలో జరిగిన  కొన్ని సంఘటనలతో మగాళ్లపై ద్వేషం పెంచేసుకుంటుంది.  అలాంటి అమ్మాయిని ఓ రోజు ఫేస్ బుక్ లో లో చూసిన దేవ్ చూసి ముచ్చట పడతాడు. అక్కడితో ఆగకుండా అమాంతం బంగీ జంప్ చేసినట్లుగా ప్రేమలో పడిపోతాడు.

అది సాధ్యమేనా అంటే మనకు బయిట బోలెడన్ని ఫేస్ బుక్ ప్రేమ కథలు రిఫరెన్స్ గా సిద్దంగా ఉన్నాయి. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సాయింతో ఆమెను సాహసోపేతంగా కలుసుకున్న దేవ్ ఓ ఛాన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేసి ప్రపోజ్ చేస్తాడు. మొదట నో చెప్పినా ఆ తర్వాత ప్రేమించటం మొదలెడుతుంది. ఇక ఇద్దరూ డీప్ లవ్ లో పడ్డారు అనుకునే లోగా ఆమె నీకన్నా నాకు బిజినెస్ ఎక్కువని బ్రేకప్ అని ప్రకటించేస్తుంది. అప్పుడు దేవ్ ఏం చేసాడు. తిరిగి ఆమెను తన ప్రపంచంలోకి ఎలా తీసుకువచ్చాడు. చివరకు ఈ జంట ఎలా ఒకటైంది అనేది మిగతా కథ.

కథ, కథనం..క్యారక్టరైజేషన్ 

సింపుల్ కథ ఉంటే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చెయ్యచ్చు అని దర్శకుడు నమ్మినట్లున్నాడు. రెండు పాత్రలు తీసుకుని వాటి మధ్య కెమిస్ట్రి పండిచటానికి ప్రయత్నించాడు. అయితే వచ్చిన చిక్కు ఏమిటంటే నిజానికి ఇధ్దరూ సేఫ్ జోన్ లో హ్యాపీగా ఉన్నవాళ్లే. దాంతో వారి ప్రేమ కథలో ఎక్కడా కాంప్లిక్ట్ కనిపించదు.  బోర్ వచ్చేస్తుంది. క్యారక్టర్ డ్రైవన్ స్టోరీలలో సరైన కాంప్లిక్ట్స్, బలమైన వ్యక్తిత్వాలు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవ్ పాత్ర ఏదో ఆషా మాషిగా రాసుకున్న కథలో కీ క్యారక్టర్ అయిన మేఘనను ఆమెలో ఉన్న కన్ఫూజన్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాలి. ఆ విషయంలో లైట్ తీసుకున్నారు. 

స్క్రీన్ ప్లే సైతం కథలాగే చాలా పేలవంగా ఉంది. ఇంటర్వెల్ దాగా కేవలం రెండు పాత్రలు పరిచయానికే సరిపోయింది. అంతేకానీ ఎక్కడా కథలోకి వెళ్లినట్లు కనపడదు. రెండు మూడు సీన్స్ తో అయ్యిపోయేదానికి ముప్పై సీన్స్ తో మన మాడు పగలకొట్టాడనిపిస్తుంది. పోనీ సెకండాఫ్ లో ఏమన్నా అద్బుతం చేసాడా అంటే ఫస్టాఫ్ లో ఏ పేస్ లో బోర్ నడించిందో ..అదే పేస్ మెయింటైన్ చేస్తూ పోయాడు. బోర్ కొట్టించటం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 
 

అవసరమా…
ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు అంటే వేరే భాషలో ఘన విజయం సాధించిన సినిమాలే ఎక్సక్లూజివ్ గా వచ్చేవి. ఇప్పుడు ఒకేసారి అక్కడా , ఇక్కడా రిలీజ్ చేస్తున్నారు. దాంతో వాళ్ల చెత్త సినిమాలు కూడా మనం స్టైయిట్ సినిమాల్లా భరించాల్సి వస్తోంది. మన టాలీవుడ్ బోర్ సినిమాలు చాలకనా వేరే వాళ్లవి కూడా డబ్బింగ్ చేసుకుని మరీ తలనొప్పి తెచ్చుకోవటం. 

కన్ఫూజన్ లో …
ఈ సినిమా చూస్తూంటే తమిళ హీరో కార్తీ కథల ఎంపికలో  ఎంత కన్ఫూజన్ లో అర్దమవుతుంది. మొన్నటికి మొన్న చినబాబు అంటూ విషయం లేని విలేజ్ సబ్జెక్టులో చేసిన కార్తి ..ఇప్పుడు మరోసారి దానికి పూర్తి విరుద్దమైన పాత్ర అన్నట్లుగా ఒప్పుకున్నాడే కాని …అసలు డైరక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు…ఏం చూపించాలనుకున్నాడు అని అడిగినా సినిమా వద్దనేవాడేమో అనిపిస్తుంది. ఇక రకుల్ ప్రీతి సింగ్ ..సీరియస్ గా డీ గ్లామర్ గా కనిపించి ఆమె అభిమానులకు ఖచ్చితంగా విరక్తి కలిగించి ఉంటుంది. 

ఎలా చేసారంటే…
ఇంతటి బోర్ సినిమాలో ఎవరెలా చేసినా మెచ్చుకోవాలనిపించదు..తిట్టుకోవాలనే ఓపికా ఉండదు. అప్పటికి చెప్పుకోవాలి కనుక…కెమెరా వర్క్ ఈ సినిమాలో హైలెట్. కథ ఏదైతే నాకేంటి నా విజువల్స్ తో పండుగ చేస్తా అన్నట్లు రెచ్చిపోయాడు. గ్రాఫిక్స్ సోసోగా ఉన్నాయి. అంటే అవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయేటంత. హారిస్‌ జయరాజ్‌ ఇచ్చిన  పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా వీర నీరసం తెప్పిస్తుంది. 

ఆఖరి మాట
కార్తి తన తొలి రోజుల్లో చేసిన చిత్రాలు ఒక సారి చూస్తే కాస్తంత ఇన్సిప్రేషన్ వచ్చి మంచి కథలు ఎంచుకునే నైపుణ్యం మెరుగుపడుతుందేమో. 

తెర వెనక..ముందు

నటీనటులు:  కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, వంశీ కృష్ణ, రేణుక తదితరులు
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
కూర్పు: ఆంటోనీ ఎల్‌ రూబెన్‌
సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌
నిర్మాణ సంస్థ: ప్రిన్స్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రజత్‌ రవిశంకర్‌