Reading Time: 2 mins

ద్రోహి సినిమా నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదల

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్రోహి. ద క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్‌ అంతా ప్రేమతో ఈ చిత్రం చేశారు. సక్సెస్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరులో టీజర్‌లో కనిపించింది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.

హీరో సందీప్‌ మాట్లాడుతూ ద్రోహి టైటిల్‌ వినగానే వెంటనే ఓకే చేసేశా. నాగార్జున నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే కమల్‌హాసన అర్జున నటించిన ఓ సినిమాను ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అందుకే అదే టైటిల్‌ అనుకున్నారు. దానికి శీర్షిక ుద క్రిమినల్‌ అని పెట్టాం. అద్భుతమైన డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. క్రిమినల్‌ అనగానే క్రైమ్‌, థ్రిల్లర్‌ అనుకుంటాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ నెల 13న విడుదల సందర్భంగా ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్‌లో రూ.112లకే టికెట్‌ ఆఫర్‌ పెట్టాం అని అన్నారు.

హీరోయిన డెబా డాలీ మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం ఓ కలలాగా ఉంది. ఈ సినిమాలో భాగం చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు, తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ  ఏడాది క్రితం ఈ జర్నీ మొదలైంది. సినిమా అనగానే అందరికీ కష్టాలుంటాయి. అవే మేమూ అనుభవించాం. నాకు మంచి టీమ్‌ దొరికింది. ఏదైనా మనసుపెట్టే తీశాం. ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషనకు ఖర్చుపెట్టే బడ్జెట్‌తో మా సినిమా చేశాం. నేను అద్భుతం తీశానని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను. ఈ అంచనాలు వస్తున్న మా చిన్న చిత్రానికి మనసుపెట్టి కేవలం రెండు
కేటాయించండి. సినిమా నిరాశ పరచడదని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.

నటీనటులు:

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ, చందు ఛార్మ్స్‌(చంద్రిక గొల్లపూడి), మహేష్‌విట్ట, మజిలి శివ, నీరజ్‌,
డెబ్బిడాలీ

సాంకేతికవర్గం :

కెమెరా: అశోకదార్బీరు,
సంగీతం: అనంత నారాయణ్‌
ఎడిటర్‌: జానీ బాషా
నిర్మాతలు: విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి
దర్శకత్వం: విజయ్‌ పెందుర్తి