ధనుష్ ద్విభాషా చిత్రం‌

Published On: July 27, 2022   |   Posted By:

ధనుష్ ద్విభాషా చిత్రం‌

ధనుష్ ద్విభాషా చిత్రం‌ సార్‌ (తెలుగు)/వాతి (తమిళం) తొలి ప్రచార చిత్రం విడుదల.
ధనుష్ పుట్టినరోజు (28, జూలై) సందర్భంగా వీడియో చిత్రం విడుదల
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణం.
సార్‌ అక్టోబర్ లో విడుదల.
తెలుగు
, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం
సార్‌ జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం సార్‌(తెలుగు), వాతి(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) మరియు శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. సార్‌ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారీ చిత్రంలో.

ఇటీవల యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్ స్లోగన్ తో ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. దీనిని మరింత ముందుకు తీసుకు వెళుతూ చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు జూలై 28 సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ సార్‌ తొలి ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.

ఈ ప్రచార చిత్రంలో ధనుష్ సార్‌ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ సార్‌ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే.

ఈ ప్రచార చిత్రంతో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ సార్‌ చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదల ఆయన ప్రచార చిత్రం కానీ, రేపు మా హీరో ధనుష్ గారు పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో చిత్రం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. అలాగే జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.

సార్‌ అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ.

తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌,సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని,తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార,ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్: జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
స‌మ‌ర్ప‌ణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌., సాయి సౌజ‌న్య‌
రచన దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్