ధమాకా చిత్రం శ్రీలీల బర్త్ డే పోస్టర్ విడుదల

Published On: June 15, 2022   |   Posted By:

ధమాకా చిత్రం శ్రీలీల బర్త్ డే పోస్టర్ విడుదల

రవితేజ “ధమాకా” నుండి శ్రీ లీల బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టి జి విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

శ్రీలీల పుట్టినరోజు సందర్భంగాసరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ బర్త్ డే పోస్టర్ లో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో బ్యూటీఫుల్ గా వుంది. ఉబెర్-కూల్ కాస్ట్యూమ్‌లో ప్లజంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రణవి పాత్రలో అలరించనుంది శ్రీలీల.

‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ప్రస్తుతం ‘ధమాకా’ షూటింగ్ చివరి దశలో ఉంది.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్