ధనుష్ మారి2 చిత్రం 21 డిసెంబర్ విడుదల
డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ధనుష్ “మారి2”
రఘువరన్ చిత్రం తో టాలీవుడ్ లో ట్రెండి యాక్టర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న ధనుష్ హీరోగా, ఫిదా, ఎం.సి.ఏ లాంటి వరుస విజయాలతో యూత్ హర్టులో పర్మినెంట్ ప్లేస్ ని కొట్టేసిన సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన లెటెస్ట్ చిత్రం మారి2.. ఈ చిత్రం మారి కి సీక్వెల్ గా వస్తుంది. ఇప్పటికే మారి కి వున్న క్రేజ్ ఈ సీక్వెల్ మారి2 కి మార్కెట్ లో క్రేజ్ ని తీసుకువచ్చింది. మారి2 టీజర్స్, పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో ఫ్యాన్సిరేట్లకే బయ్యర్స్ కొనుగొలు చేయటం విశేష. బాలీజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత ధనుష్, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లో ధనుష్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కి ట్రెండ్ మారాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో పలు చిత్రాలు పంపిణి చేసిన సాయికృష్ణా ఫిలింస్ అధినేత సాయి కృష్ణ పెండ్యాల విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారి2 లో ఓ సాంగ్ ని ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు లెజెండ్ ఇలయరాజా పాడగా, హీరో ధనుష్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.
ఈ సందర్బంగా నిర్మాత, హీరో ధనుష్ మాట్లాడుతూ.. మారి చిత్రం చాలా పెద్ద సక్సస్ ని సాధించింది. ఇప్పడు దానికి సీక్వెల్ గా మారి2ని విడుదల చేస్తున్నాము. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంభందించిన టీజర్స్ , పోస్టర్స్ తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అకట్టుకుంటుంది. ఇళయరాజా గారు ఓక సాంగ్ ని పాడటం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు
నటీనటులుః ధనుష్, సాయిపల్లవి, కృష్ణ కులశేఖర్,వరలక్ష్మి శరత్‌కుమార్,టోవినో థామస్,రోబో శంకర్,వినోద్,మనోబాలా,ఆడుకాలమ్ నరేన్ తదితరులు నటించారు
మాటలు, పాటలుః సామ్రాట్, రచనా సహకారంః కార్తీక్, ఎం.రాజేష్,గాయకులుఃఅనంతు, ఎం.ఎం.మానసి, ధనుష్, రంజిత్, శ్రీవర్ధిని, దీ, జితిన్, సౌండ్ ఎఫెక్ట్స్ః సింక్ సినిమాస్, మిక్సింగ్ః రాజాకృష్ణన్, కొరియో గ్రాఫర్స్ ..బాబాభాస్కర్, జానీ, స్టంట్స్ఃసిల్వా, ఎడిటర్ః ప్రసన్న జి.కె., డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః ఓం ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ఃఎస్.వినోద్ కుమార్, పి.ఆర్.ఓ.. ఏలూరు శ్రీనుసంగీతంః యువన్ శంకర్‌రాజా, నిర్మాతః ధనుష్, రచన-దర్శకత్వంఃబాలాజీ మోహన్,