Reading Time: 3 mins


నన్ను క్షమించండి షార్ట్ ఫిల్మ్ గ్రాండ్ ప్రీమియర్ షో

ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ‘లడ్డు’ ఫేం శశిధర్  “నన్ను క్షమించండి” షార్ట్ ఫిల్మ్ గ్రాండ్ ప్రీమియర్ షో
శ్రీ

దేవి ప్రసన్న మూవీస్ బ్యానర్ పై దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ రూపొందించిన సరికొత్త షార్ట్ ఫిలిం “నన్ను క్షమించండి”. గతంలో ఇదే బ్యానర్ పై రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన “లడ్డు” ఏ స్వీట్ మొమరీ మంచి ప్రేక్షకాదరణతో పాటు 28 ఇంటర్నేషనల్ అవార్డులు, 3 కేటగిరీల్లో 4 నంది పురస్కారాలు లభించాయి. 

పి.కృష్ణకాంత్, రాఘవ్ ఓంకార్ శశిధర్ సంయుక్తంగా నిర్మించిన “నన్ను క్షమించండి” షార్ట్ ఫిలింకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించగా… శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫి అందించారు. “నన్ను క్షమించండి” ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై తమ అభినందనల్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ …. శశిధర్ మంచి దర్శకుడు అని లడ్డుతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు నన్ను క్షమించండి పేరుతో ఓ మంచి ఆలోచనాత్మక షార్ట్ ఫిలిం రూపొందించాడు.  ఓ మంచి కథ చెబితే శశిధర్ తో సినిమా నిర్మించడానికి నేను రెడీ. లడ్డు, నన్ను క్షమించండి రెండు లఘు చిత్రాలు కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.  ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు రావాలి. భూతు డైలాగ్స్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు వస్తున్న ఈ కాలంలో కూడా వల్గారిటీ లేకుండా రూపొందిస్తున్న ఇలాంటి  మంచి సినిమాలు కావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు. 
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ… ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడే నాకు ధైర్యం వస్తుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తపనతో, కసితో పని చేస్తారు. శశిధర్ త్వరలో మంచి దర్శకుడు అవుతాడు. తండ్రి కొడుకు మధ్య హ్యూమన్ ఎమోషన్ ని చాలా బాగా చూపించాడు. అందరూ చాలా బాగా నటించారు. అని అన్నారు.

రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ… శశిధర్ నాకు ముందునుంచీ షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఎంచుకునే కథల దగ్గరి నుంచి ఆర్టిస్టుల వరకు అంతా కొత్తగా ఉంటుంది. తల్లి సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వస్తుంటాయి. ఫాదర్ మీద చాలా తక్కువగా వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో టాప్ టెన్ లో నన్ను క్షమించండి నిలుస్తుంది. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.  ఇకనైనా షార్ట్ ఫిల్మ్స్ ఆపి సినిమా దర్శకత్వం చేస్తాడని ఆశిస్తున్నాను. అని అన్నారు. 

నటుడు రవి వర్మ మాట్లాడుతూ… లడ్డు తర్వాత నన్ను క్షమించండిలో మంచి పాత్ర ఇచ్చాడు. తండ్రి పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మా కృష్ణకాంత్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. తన తండ్రికి ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. శశిధర్ ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ తప్పకుండా అవుతాడు. అని అన్నారు. 

హీరో సాగర్ మాట్లాడుతూ… శశి నేను తాగుబోతు రమేష్ ముగ్గురం కొత్త కాన్సెప్ట్ గురించి ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం. లడ్డు అనే షార్ట్ ఫిలిం చేస్తున్నా అని శశి చెబితే…. లడ్డు తో ఏం చేస్తాడులే అనుకున్నా. కానీ సక్సెస్ చేశాడు. ఇప్పుడు నన్ను క్షమించండి తో మరోసారి సక్సెస్ కొట్టాడు. షార్ట్ ఫిలిం చేయనని కృష్ణకాంత్ గారి కోసం చేశాడు. ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతాడని ధీమాగా చెప్పగలను. అని అన్నారు. 

నటుడు, నిర్మాత కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఓ షార్ట్ ఫిలిం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లడ్డు షార్ట్ ఫిలిం చూసాను. ఈ డైరెక్టర్ తో లఘు చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాను. అలా శశిని ఒప్పించాను.  నేను జీవితంలో యాక్టింగ్ చేస్తా అనుకోలేదు. ఎవరితో అయిన యాక్ట్ చేయించే సత్తా శశిధర్ కు ఉంది. మా నాన్నకు శశిధర్ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అని అన్నారు. 
దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ…. నా దర్శకత్వంలో వచ్చిన లడ్డు షార్ట్ ఫిల్మ్ కి చాలా అవార్డులు వచ్చాయి. మంచి పేరొచ్చింది. దాంతో ఇక షార్ట్ ఫిల్మ్ చేయొద్దు అనుకున్నా. కానీ కృష్ణకాంత్ గారు కలిశారు. ఆయన షార్ట్ ఫిల్మ్ చేయమని అడిగిన పద్ధతి నాకు బాగా నచ్చింది. ఆయన నన్ను కన్విన్స్ చేశారు. కేవలం ఆయన కోసం మళ్లీ షార్ట్ ఫిల్మ్ చేశాను. నన్ను క్షమించండి కోసం చాలా మంది కష్టపడ్డారు. కేవలం నాకోసం కష్టపడ్డారు. అందరికీ థాంక్స్. డిఓపి శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ సినిమాల్లో  బిజీగా వున్నప్పటికీ… నాకోసం పని చేసి మంచి షార్ట్ ఫిలిం వచ్చేందుకు కృషి చేశారు.  రవి వర్మ తన సినిమా అనుకోని పనిచేశారు. తాగుబోతు రమేష్, గిరి అన్న చాలా సపోర్ట్ చేశారు. పేరు పేరునా అందరికీ థాంక్స్ చెబుతున్నాను. నెక్ట్స్ షార్ట్ ఫిల్మ్ తో కాకుండా సినిమాతో మీ ముందుకు వస్తా అని నమ్మకంతో చెబుతున్నాను. అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ నటీనటులు పి.కృష్ణకాంత్, రవి వర్మ, సుధీర్ బాబు, అస్మిత, గిరిధర్, తాగుబోతు రమేష్, కర్రా నాగేష్, యు. ఏడుకొండలు, డా.శ్రీనివాసరావు పసుపులేటి, చాణక్య, మాధవి దండా, బాలు నాయుడు, చందన్, మాస్టర్ సుశాంత్ చౌదరి, మాస్టర్ నయన్ తో పాటు టెక్నీషియన్స్ పాల్గొన్నారు.