నమస్తే సేట్ జీ ఫస్ట్ లుక్ విడుదల

Published On: May 20, 2021   |   Posted By:
నమస్తే సేట్ జీ ఫస్ట్ లుక్ విడుదల
 
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ లక్ష్మి నిర్మాణ సారథ్యంలో  తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “నమస్తే సేట్ జీ”. సాయికృష్ణ ,స్వప్న చౌదరి హీరో హీరోయిన్లు గా టార్జాన్ లక్ష్మణ్ , శాంతి స్వరూప్, శ్రీనివాసులు తదితరులు నటిస్తున్న ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ “ఫ్రెంట్ లైన్ వారియర్స్ చేసే సేవల్ని చూపిస్తూ, అలానే ఈ సమాజంలో కనపడని శ్రామికులు గా ఉన్న కిరాణా షాపు లు నడిపించుకునే సామాన్య కుటుంబాల కథ ఇది అని నిర్మాత అన్నారు.
 
డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ “మొదటి సారి లాక్డౌన్ లో కిరాణా షాపు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి ఈ కథను సిద్ధం చేసాం. మనకు నిత్యం ఉపయోగపడే ప్రతి వస్తువు పిన్ను నుండి పెన్ను దాకా, కూరగాయలు మొదలు అన్ని నిత్యావసర సరుకులు లభించేవి కేవలం కిరాణం షాపులోనే. అలాంటి కిరాణా దుకాణం నడిపించే సేట్ ల జీవన శైలిని, కరోనా సమయంలో నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి సరుకులు అందిస్తూ వారి జీవితాల్ని సైతం రిస్క్ లో పెట్టిన వారి  దైర్య సాహసలని ఈ సినిమా లో చూపిస్తున్నాం అని అన్నారు. మనం చిన్నప్పటి నుండి ఏ షాపు వాళ్లనైనా సేటు, సేట్ జీ అంటూంటాం.  ఆ వాడుక భాషని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ని తిస్తున్నాం. సెకండ్ వేవ్ కరోనా సమయంలో కిరాణా షాపు వాళ్లు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని అన్నారు.
 
ఈ సినిమా కి తల్లాడ శ్రీలక్ష్మీ నిర్మాణ సారథ్యం
 
కో-ప్రొడ్యూసర్ ;-పొట్టిముతి గౌతమ్,  శ్రీ కౌశిక్ గుప్తా
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల,విజయ్ నిట్టల,చందు
 
రచన – రమేష్ కుమార్ వెలుపుకొండ, శివ కాకు
 
సంగీతం;- వి.ఆర్.ఏ.ప్రదీప్ ,కార్తిక్ కొడకండ్ల,
 
కెమెరా – శివ రాథోడ్, సైదులు, శ్రీకాంత్,
 
 సాహిత్యం- చింతల శ్రీనివాస్, సంధ్యవర్షిని, శరత్ చంద్ర