నయట్టు మూవీ రివ్యూ(మలయాళం)
పోలీస్ వేట: నయట్టు (మలయాళం) రివ్యూ
Rating:3/5
పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కథ కాస్త బాగున్నా ప్రేక్షకులు ఈజీగా చూస్తారు హిట్ కూడా చేసేస్తారు ఇక అదే మనం మలయాళం సినిమాల గురించి చెప్పుకుంటే అక్కడ వచ్చే అన్ని సినిమాలు దాదాపు మంచి కథా బలంతో ఉంటాయి అందుకే మలయాళ సినిమాలను చూడడానికి అన్ని భాషల ప్రేక్షకులు ఇష్టపడతారు అలా రీసెంట్ గా వచ్చిన సినిమానే నాయట్టు మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
కేరళలోని ఒక టౌన్ పోలీస్ స్టేషన్లో హీరో ప్రవీణ్ మైకేల్ (కుంచాకో బోబన్ ) తన తండ్రి చనిపోవడం ద్వారా వచ్చిన పోలీస్ జాబ్ చేస్తూ ఉంటాడు తనకు తల్లి మాత్రమే ఉంటుంది. ఇక అదే స్టేషన్ లో ASI మణియన్ (జోజు జార్జ్ ) కూడా పనిచేస్తూ ఉంటాడు తనకి కూతురు భార్య ఉంటారు కూతురును మంచి సింగర్ చేయాలని కొద్ది రోజుల్లో జరగబోయే కల్చరల్ పోటిలకోసం ఒక డాన్స్ మాస్టర్ ను పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తు ఉంటాడు.అదే స్టేషన్ లో పని చేసే సునీత (నిమిష సాజయన్) తన తల్లితో కలిసి ఉంటుంది ఆమెకు ఊరిలో ఒక వ్యక్తితో సమస్య ఉంటుంది అయితే ఒకరోజు సునీతతో సమస్య ఉన్న వ్యక్తి తన వాళ్ళతో స్టేషన్ కు రావడం అక్కడ అనుకోకుండా ప్రవీణ్ మైకేల్ అలాగే మణియన్ లు వాళ్ళతో గొడవ పడడం జరుగుతుంది అదే రోజు రాత్రి వీళ్ళు ముగ్గురు వెళుతున్న జీప్ యాక్సిడెంట్ అయి తాము గొడవ పడ్డ గ్రూప్ లో ఒక వ్యక్తి చనిపోతాడు దాంతో వీళ్ళను పై ఆఫీసర్స్ అరెస్ట్ చేయాలి అనుకునేసరికి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతారు. దాంతో ఇష్యూ పెద్దది అయి దీంట్లో సీఎం కూడా ఇన్వాల్వ్ అవుతాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది?? అసలు నేరం వీళ్ళే చేశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : నేరాలు జరిగినప్పుడు క్రిమినల్స్ ను పట్టుకునే పోలీసులు అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసులు వారి వెంట పడడం అనే ఈ కాన్సెప్ట్ మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది.అయితే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి పైకి అందరికీ వాటి గురించి తెలియకపోయినా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో వాటిని చూపించినా ఈ సినిమాలో దాన్ని ఇంకా డెప్త్ గా చూపించడంతో ఈ సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది.
నిజానికి యాక్సిడెంట్ జరిగి రూలింగ్ పార్టీ లోకల్ లీడర్ చనిపోవడం అనేది హీరో ప్రవీణ్ మైకేల్, ASI మణియన్ లేడీ కానిస్టేబుల్ సునీతలు కావాలని చేసింది కాదు అందులోనూ అప్పుడు జీప్ నడిపింది కూడా వాళ్ళు కాదు ASI మణియన్ రిలేటివ్ నడిపిస్తాడు కానీ వాళ్ళ ముగ్గురు అప్పటికే రూలింగ్ పార్టీ లోకల్ గ్యాంగ్ తో గొడవ జరుగుతుంది దాంతో అటు వాళ్ళను ఫేస్ చేయలేక ఇటు తమను డిపార్ట్ మెంట్ వాళ్లే అరెస్ట్ చేస్తే అంత ఈజీగా ఈ కేసు నుంచి బయటపడం అన్న భయంతో వాళ్ళు ముగ్గురు పారిపోతారు. కొన్ని రోజుల్లో జరగబోయే బై ఎలక్షన్ లో ఎలాగైనా తమ పార్టీ గెలవాలి అని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉండడంతో అందులోనూ చనిపోయింది తమ పార్టీ గెలుపును డిసైడ్ చేసే ఒక కులం వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి ఆ కులం వాళ్ళను ఎలాగైనా సాటిస్ ఫై చేయాలని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కు స్పెషల్ గా ఈ కేసు అప్పగిస్తాడు.ఆమె వీళ్ళను పట్టుకోవడానికి ట్రై చేయడం చివరకు వీళ్ళు దొరికే సమయానికి ASI మణియన్ సూసైడ్ చేసుకుని చనిపోవడం దాంతో పై ఆఫీసర్స్ ఈ కేసులో అన్నిటికీ అతన్నే భాద్యున్ని చేస్తూ తాము బయటపడాలి అనుకోవడం లాంటి కొన్ని చేదు నిజాలను చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది.
ఒక క్రైం జరిగినప్పుడు దాంట్లో అనుకోకుండా ఇనావాల్వ్ అయిన వాళ్ళు పోలీసులు అయినా సరే తాము నిర్దోషులు అని నిరూపించుకునే అవకాశం లేదని అసలు మన వ్యవస్థనే గుడ్డిదని అలాగే మన ప్రభుత్వాలు కూడా తమ సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఎంత దారుణంగా వ్యవహరిస్తారు అనే విషయాల గురించి దర్శకుడు నిర్మోమొహమాటంగా సినిమాలో చూపించాడు ఈ సినిమా చూస్తున్నప్పుడు పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనుకున్నా ఆ కోణంలో ఆలోచించినా మనలో ఒక తెలియని భయం కలుగుతుంది.
ఇక సినిమాలో ASI మణియన్ పాత్ర ద్వారా తమ డిపార్ట్ మెంట్ కోసం తాము ఎన్ని నేరాలు చేసినా ( ఒక మంత్రి రిలేటివ్ అమ్మాయిని ఓ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని అతన్ని చంపమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని మణియన్ హీరోతో ఒక సీన్ లో చెప్తాడు) తమకు ఇబ్బంది వచ్చినప్పుడు అదే డిపార్ట్ మెంట్ దాంట్లో ఉన్న తమ పై ఆఫీసర్స్ కూడా తమను కాపాడరని అధికారంలో ఉన్న వాళ్ళకోసం తమను బలి పశువులు చేస్తారని చాలా బోల్డ్ గా చూపించారు. సినిమా చివరలో జరిగిన క్రైం లో సూసైడ్ చేసుకున్న మణియన్ నే దోషిగా చూపిస్తే మీరు బయట పడొచ్చని వాళ్ళను పేపర్స్ మీద సంతకం పెట్టాలని పై ఆఫీసర్ అడగడం వీళ్ళ ముందే మణియన్ సూసైడ్ ను రిక్రియెట్ చేయడం అతని సూసైడ్ లెటర్ కూడా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ తో రాయిస్తాం అనడం లాంటి విషయాలు చూస్తుంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎంత దూరం వెళ్తారు అనేది ప్రేక్షకులకు షాకింగ్ గా అనిపిస్తుంది.
ఇక సినిమా నటీనటుల విషయానికి వస్తే
సినిమాలో ప్రవీణ్ మైకేల్ గా చేసిన కుంచకో బోబన్ అలాగే ASI మణియన్ గా చేసిన జోజు జార్జ్ అలాగే లేడీ కానిస్టేబుల్ సునీత గా చేసిన నిమిష సజయన్ అలాగే స్పెషల్ ఆఫీసర్ గా చేసిన యామ గిల్ గమేశ్ ముఖ్యమంత్రి గా చేసిన జాఫర్ ఇడుక్కి మలయాళంలో బాగా పేరున్న నటులే వాళ్ళ నటనే మనల్ని సినిమా రెండుగంటల పాటు కదలకుండా చూసేట్టు చేస్తుంది
టెక్నికల్ డిపార్ట్ మెంట్స్:
ఇక కేవలం ఒకే ఒక పాట ఉన్న ఈ సినిమా సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా మూడ్ కు తగ్గట్టుగా కెమెరా పనితనం , ఆర్ట్ డైరెక్షన్ ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమా రచయిత షాహి కబీర్ గతంలో పోలీస్ గా పనిచేసి సినిమాల్లోకి వచ్చిన వాడు కావడం.
హైలైట్స్ :
కథా కథనాలు
నటీ నటుల ప్రతిభ
మైనస్ :మన తెలుగు వాళ్ళు నిత్యం కోరుకునే ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం
,
సెకండాప్ లో బోర్ కొట్టడం
చూడచ్చా
ఖచ్చితంగా ఓ కొత్త తరహా చిత్రం చూడాలనుకునేవాళ్లకు నచ్చుతుంది
ఎవరెవరు..
నటీనటులు: జోజు జార్జ్ ,నిమిష సాజయన్, కుంచాకో బోబన్ తదితరులు.
రచన: షాహి కబీర్
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: షాజూ ఖాలిద్
ఎడిటర్ : మహేష్ నారాయణ్
రన్ టైమ్: 2 గంటల, నాలుగు నిముషాలు
నిర్మాణం: రంజిత్, శశిధరన్,మార్టిన్ ప్రకట్
డైరక్టర్: మార్టిన్ ప్రకట్
విడుదల తేదీ: 8,ఏప్రియల్ 2021
ఓటీటి: నెట్ ఫ్లిక్స్