నవ్వించే అడల్ట్ కామెడీ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ రివ్యూ

Published On: March 22, 2019   |   Posted By:

నవ్వించే అడల్ట్ కామెడీ  (‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ రివ్యూ!)

Rating: 2.5/5

 మొదట్లో ఒట్టి  హారర్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత గట్టి హర్రర్ కామెడీలు వచ్చాయి. ఇప్పుడు హర్రర్ అడల్ట్ కామెడీలు మొదలయ్యాయి.  అలా దెయ్యాల కథలకు డోస్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ స్పీడు ఎక్కడిదాకా వెళ్తుందో కానీ…ఇలాంటి అడల్ట్ కామెడీలు మాత్రం తెలుగు తెరకు కొత్తే. మరి వీటిని ఎంతవరకూ మనవాళ్లు ఆదరిస్తారు. అసలు ఈ కామెడీ నవ్విస్తుందా?ఇందులో కథేంటి? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి…

అనగనగా ఓ కుర్రాడు. వాడో ప్లేబోయ్ వాడి పేరు చందు(ఆదిత్). వీడు పెళ్లి చేసుకోవాలనుకుని ఏ పెళ్లి చూపులకు వెళ్లినా ముందే అతని క్యారక్టర్ లీకై వీకై ఆ పెళ్లి చూపులు ప్లాఫై పెద్ద టాక్ అవుతూంటుంది. అయినా ఈ పట్టువదలని పెళ్లిమార్కుడు ఓ రోజు పూజా(నిక్కీ తంబోలి) అనే అమ్మాయిని పెళ్లిచూపులు చూస్తాడు. ఆ అమ్మాయి తండ్రి అదో టైప్. ఆయన తన కూతురు పూజాని ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్లి పరిచయం పెంచుకో, ఆమెను ఇంప్రెస్ చేసుకో అంటూ ఇంక రకరకలా ఇక్కడ రాయటం ధర్మం కానివి బోలెడు చెప్తాడు. అంతేకాకుండా తనకు ప్లే బోయ్ అల్లుడు రావటం చాలా ఇష్టమని కాంప్లిమెంట్ ఇస్తాడు. అయితే తన కూతురుని తీసుకెళ్లటానికి కొన్ని కండీషన్స్ పెడతాడు. వాటిలో ఒకటి ఏంటంటే నువ్వు మా అమ్మాయిని తీసుకెళ్లటం తో పాటు వేరే జంటను కూడా నీతో తీసుకెళ్లమని. 
దాంతో చందు తన ప్రెండ్ ప్రముఖ తింగరోడు, ప్రేమలో అప్పుడే ప్రవేశించినోడు అయిన  శివ(హేమంత్)ని రమ్మంటాడు. శివ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వీరితో ట్రిప్ లో జాయిన్ అవుతాడు. ఈ రెండు జంటలు బ్యాంకాక్ కి జంప్. బ్యాంకాక్ వెళ్లి అక్కడ తన గర్ల్ ప్రెండ్ లను టెమ్ట్ చేసి కామసూత్ర పాఠాలు వళ్లించేద్దామనేది వీరి ప్లాన్. అయితే ఇక్కడే వాళ్ల ప్లాన్ దెబ్బ తింటుంది. వీళ్లు దిగిన ఓ గెస్ట్ హౌస్ లో ఓ దెయ్యం ఉంటుంది.
అదో ఆడ దెయ్యం ఓ రకంగా చెప్పాలంటే కామ పిశాచి. తను జీవితంలో శృంగార పాఠాలను వల్లె వేయకుండానే యాక్సిడెంట్ లో పోయానని వాటిని ఎలాగైనా రుచి చూడాలని వెయిట్ చేస్తూంటుంది. ఆ కోరిక తీర్చేస్తే తను స్వర్గానికి వెళ్లిపోతుందన్నమాట. అయితే ఇక్కడో కండీషన్ ఆ దెయ్యం ఎవరితో పడితే వారితో శృంగారంలో పాల్గోదు. కేవలం వర్జిన్స్ మాత్రమే కావాలి. ఆ క్రమంలో ఈ హౌస్ లో దిగిన వాళ్లిద్దరిపై దాని కన్ను పడుతుంది. వాళ్లని ఎలాగోలా నయానో, భయానో ముగ్గులోకి దించి తను స్వర్గయాత్ర పెట్టుకోదలుస్తుంది. మరి వీళ్లిద్దరూ లొంగుతారా? అసలు వీళ్లు ఆ ఇంట్లోంచి బయటపడతారా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది…

 బూతు సినిమాలు మనకు కొత్తేమీ కాదు కానీ వాటిని అడ్డం పెట్టుకుని కామెడీ చేయటం మాత్రం కొత్తే. హర్రర్ కామెడీ అంటారే కానీ ఎక్కడా మనకు హర్రర్ కనపడదు. కేవలం కామెడీ కోసమే సినిమా తీసినట్లుంది. బూతులు బాగా దట్టించి వదిలిన ఈ సినిమా ఓ అడల్ట్ కామెడీని చూద్దామని ఫిక్సై వెళ్తే నవ్విస్తుంది. అలా కాకుండా ఆ బూతు డైలాగులకు యావగించుకుంటే ఇంక అసలు ఎంజాయ్ చేయటం కష్టం. దర్శకుడు ఈ సినిమాని బిగ్ బాస్ టైప్ లో నడిపారు. ఆ నేరేషన్ కొద్దిగా విసుగ్గా ఉంటుంది. బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసేవాళ్లకు అది ఇంట్రస్టింగ్ గా ఉంటుందేమో కానీ మిగతావాళ్లకు అది ఇబ్బందే. అంతే కాదు ఈ సినిమాలో గే కామెడీ కూడా ఉంది. అది కొంత జుగుప్సాకరంగానే ఉంది. అలాంటివి ఎవాయిడ్ చేస్తే బాగుండేది. 

ఎవరెలా చేసారు…

ఈ సినిమాకు ఫెరఫార్మెన్స్ లు చూడటానికి వెళ్లము కాబట్టి ఆ విషయంలో పెద్దగా చర్చించుకునేదేమీ లేదు. అప్పటికీ హీరోయిన్స్ గ్లామర్ కోణంలో, హీరో, మిగితా ఆర్టిస్ట్ లు అడల్డ్ యాంగిల్ లో బాగానే రెచ్చిపోయి విందు చేసారు. మిగతా డిపార్ట్మెంట్ లు ఈ సినిమా స్దాయికి తగ్గట్లే ఉన్నాయి. అవన్నీ పట్టించుకునే స్దితిలో ప్రేక్షకుడు ఉండడు అని నమ్మి పనిచేసినట్లున్నారు. 

చూడచ్చా…

ఇంటర్నెట్ లో డైరక్ట్ ఫోర్న్ చూస్తున్న జనరేషన్ ఇది ఇలాంటి సినిమాలు వాళ్లకు ‘జుజుబి’

ఆఖరి విషయం

ఏమో ఈ సినిమాకు డబ్బులు రావటం చూసి రేపు మరిన్ని డైరక్ట్ తెలుగు అడల్ట్ కామెడీలు వచ్చినా ఆశ్చర్యపోనక్కలేదు.

నటీనటులు : అదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ మోతే తదితరులు
దర్శకత్వం : సంతోష్ పి.జయకృష్ణ
సంగీతం : బాల మురళి
ఎడిటర్ : ప్రసన్న జి.కె.