నాటకం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాటకం’.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకుడు. హైదరాబాద్ లో ఘనంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ కార్యక్రమానికి హీరో సుధీర్ బాబు, RX100 ఫేమ్ హీరో కార్తికేయ,ముషీరాబాద్ ఎమ్మెల్యే , స్టేట్ ప్రెసిడెంట్ అఫ్ బీజేపీ కే. లక్ష్మణ రావు గార్లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు హీరో గారికి, ప్రొడ్యూసర్స్ కి చాల థాంక్స్.. సినిమా టెక్నిషియన్స్ అందరికి అల్ ది బెస్ట్.. ముఖ్యంగా కళ్యాణ్ గారు చాల బాగా కష్టపడ్డారు.. కొన్ని విజువల్స్ చూడగానే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను.. అదే విషయం వారికి చెప్పాను.. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను.. ఈ చిన్న సినిమాను పెద్ద హిట్ చేయాలనీ ప్రేక్షకులను కోరుతున్నాను అన్నారు..
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ గారు మాట్లాడుతూ.. మీడియా వారికీ చాల థాంక్స్ అంది.. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాల థాంక్స్.. ఒక మంచి సినిమా తో రావాలని , అందరికి నచ్చేవిధంగా ఉండే సినిమా అయితేనే చేద్దాం అని ఖుషి గారితో చెప్పాను.. ఈ నాటకం సినిమా ఆ కోవాలి వచ్చిందే.. సాయి కార్తిక్ గారు చాలా మంచి సంగీతం అందించారు.. ఈ సినిమాలో అన్ని పాటలతో మా హృదయాన్ని దోచేశారు అన్నారు..
నిర్మాత ఖుషి గారు మాట్లాడుతూ.. మాకు మొదటినుంచి సపోర్ట్ చేసిన హీరో సుధీర్ బాబు గారికి చాల థాంక్స్.. సినిమా బాగా నచ్చి ఈ నాటకం సినిమా కొన్నాను.. సినిమా పై హిట్ అవుతుందని మంచి నమ్మకం ఉంది.. 300 ప్లస్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమా టీం అంతా మంచి ప్రేమతో చేసారు..ట్రైలర్ చూడగానే పెద్ద సినిమాల తో పోల్చారు.. అర్జున్ రెడ్డి, RX100 లాంటి సినిమాలతో పోల్చినందుకు చాల థాంక్స్.. అన్నారు..
ముషీరాబాద్ ఎమ్మెల్యే , స్టేట్ ప్రెసిడెంట్ అఫ్ బీజేపీ కే. లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ.. నాటకం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి కారణం ప్రవీణ్ గాంధీ.. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్
వారు పుష్ చేయడం హ్యాపీగా ఉంది.. ఇలాంటి చిన్న సినిమాల ద్వారా కొత్తవారు పరిచయమవుతుంటారు.. అది ఇండస్ట్రీ మంచి పరిణామం.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా.. అన్నారు..
కెమెరామన్ అంజి గారు మాట్లాడుతూ.. 5 నిముషాలు ఈ సినిమా స్టోరీ నేరేట్ చేశారు డైరెక్టర్ గారు.. చాల ఇంప్రెసివ్ స్టోరీ.. వెంటనే సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాం.. బాపట్ల లో ఈ సినిమా షూటింగ్ చేసాము.. సినిమా క్యాస్ట్ అండ్ క్రూ చాల బాగా పనిచేశారు.. ఆశిష్ చాల బాగా యాక్ట్ చేసారు.. అషిమా మంచి కోపరేటివ్ యాక్ట్రెస్.. తాను మంచి హీరోయిన్ అవుతుంది.. డైరెక్టర్ కళ్యాణ్ జి ఫస్ట్ సినిమా చేసినట్లు లేదు అంత కమాండ్ ఉంది అయన కు వర్క్ మీద.. అందరి టెక్నీషియన్స్ తో మంచి వర్క్స్ ది బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు.. హిట్ సినిమా కి పనిచేశాం అన్నంత హ్యాపీ గా ఉంది అన్నారు..
డైరెక్టర్ కళ్యాణ్ జి గోగన మాట్లాడుతూ.. మా సినిమా ని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన అందరు అతిధులకు నా హృదయ పూర్వక అభినందనలు.. ఈ సినిమా ని RX100 , అర్జున్ రెడ్డి లతో పోల్చడం గర్వంగా ఉంది.. పదిహేను రోజుల్లో ఈ సినిమా కథ రాసుకున్నాను.. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కి తీసుకెళ్ళాను.. వారు సింగిల్ సిట్టింగ్ లో సినిమా ఓకే చేశారు.స్టోరీ చెప్పగానే మా అందరికంటే ఈ సినిమా ని నమ్మింది , సూపర్ హిట్ అవుతుందని నమ్మింది సాయి కార్తిక్ గారు.. ఆ తర్వాత అంజి గారిని పరిచయడం అయన మా సినిమా ని ఒప్పుకోవడం నిజంగా మా అదృష్టం.. హీరోయిన్ అషిమా చాల బాగా చేసింది.. హీరో ఆశిష్ గాంధీ ఎంత కష్టపడ్డారో రేపు సినిమా చూస్తే మీకే కనిపిస్తుంది అన్నారు.
RX 100 హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాను RX 100 తో పోలుస్తున్నారు.. చాల ఆనందంగా ఉన్నాను.. ఈ సినిమా అంతకుమించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.. హీరో ఆశిష్ సినిమా లో ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉన్నారు.. సినిమాపై ఇప్పటినుంచే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి.. దర్శకుడు కళ్యాణ్ జి కష్టం ట్రైలర్ లో కనిపిస్తుంది.. ట్రైలర్ చాల బాగుంది.. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాను అన్నారు..
సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమా కొంటున్నామని రిజ్వాన్ గారు చెప్ప్పారు.. ఆ టైం లో వద్దన్నాను.. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. అయన సినిమా ను కొన్నారంటేనే ఈ సినిమలో ఎంత కంటెంట్ ఉందో అర్థమవుతుంది.. హీరో ఆశిష్ గాంధీ సినిమా లో చాల బాగా యాక్ట్ చేసాడని ట్రైలర్ చూస్తేనే తెలిసింది.. పది సినిమా అనుభవం ఉన్న హీరోలా చాల బాగా చేసాడు.. డైరెక్టర్ కళ్యాణ్ ఈ సినిమా పై ఎంత హార్డ్ వర్క్ చేసాడో సినిమా టేకింగ్స్, లుక్స్ చూస్తూనే తెలిసింది. సాయి కార్తిక్ మ్యూజిక్ చాల బాగుంటుంది.. ఈ సినిమా లో ఓ బిట్ నన్ను చాల బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన అంజి ని ఈ సినిమా నుంచి గరుడవేగ అంజి అనే బదులు నాటకం అంజి అని అంటారు. విజువల్స్ చాల బాగా ఉన్నాయి.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ సినిమా కి పనిచేసిన అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..
హీరో ఆశీష్ గాంధీ మాట్లాడుతూ.. ఇక్కడికొచ్చిన మీడియా కి, గెస్ట్ లందరికి చాల థాంక్స్.. నాకు తెలిసి ఈరోజు
చాల హ్యాపీ గా ఉన్న వ్యక్తి మా నాన్నగారు.. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన అయన చాల థాంక్స్.. డైరెక్టర్ కళ్యాణ్ గారికి చాల థాంక్స్.. ఇంత మంచి స్టోరీ నాకు ఇచ్చినందుకు.. సాయి కార్తీక్ గారు మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు.. సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చాయి.. అంజి గారు నిజంగా నాకు ఒక్కసారి కూడా మానిటర్ చూపించలేదు.. నా కు మంచి కాంప్లికేట్ ఇచ్చిన అయన కు థాంక్స్.. ట్రైలర్ చూసి సినిమా తీసుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు.. చిన్న సినిమా అయినా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను అన్నారు..