నా నీ ప్రేమ కథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
నా నీ ప్రేమ కథ యూత్, ఫ్యామిలీ అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం: ప్రెస్ మీట్ లో నా నీ ప్రేమ కథ టీమ్
అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం నా నీ ప్రేమ కథ. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్ , రామకృష్ణ గౌడ్, శోభారాణి పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నా నీ ప్రేమ కథ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. సినిమా చాలా బావొచ్చింది. టీం చాలా కస్టపడి ఈ సినిమా చేసింది. కొత్త దర్శకుడు నటుడు చాలా అంకితభావంతో పని చేశారు. చిన్న సినిమాలని ప్రోత్సహించాలి. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
అముద శ్రీనివాస్ మాట్లాడుతూ యధార్ద సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. నటుడి గా దర్శకుడి పని చేయడం ఒక సవాల్. మా డీవోపీ తో పాటు చిత్ర బృందం అంతా ఎంతో సహకరించింది. నిర్మాత శ్రవణ్ కుమార్ కుమార్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సింది సమకూర్చారు. ఇందులో హీరో పాత్ర పేపర్ బాయ్, హీరోయిన్ డాక్టర్. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? అనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రేమ ఎలా అయినా పుట్టొచ్చు అనేది ఇందులో చిత్రీకరించాం. యూత్, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ ఇది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
నిర్మాత పోత్నాక్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కథ విన్న వంటనే చాలా నచ్చింది. దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఇచ్చాను. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపాం. ఇందులో పని చేసిన అందరూ వారి పాత్రకు న్యాయం చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత మరిన్ని చిత్రాలు చేయాలనే ఆసక్తి కలిగింది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా మంచి సినిమా. మీ అందరి ఆదరణ కావాలి అన్నారు,
శోభారాణి మాట్లాడుతూ కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఎంతో అనుభవం వున్న నటుడు దర్శకుడిలా ఈ సినిమా చేశారు. టీజర్ ట్రైలర్ పాటలు చాలా బావున్నాయి. మంచి రచన కనిపిస్తోంది. శ్రీనివాస్ చక్కగా నటించారు. శ్రీనివాస్ కి తనకంటూ ఒక గుర్తింపు వస్తుందనే నమ్మకం వుంది. నిర్మాత శ్రవణ్ కుమార్ గారికి అభినందనలు.చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ కథ చాలా బావుంటుంది. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు :
అముద శ్రీనివాస్. కారుణ్య చౌదరి, రమ్య, అజయ్ ఘోష్, షఫీ, అన్నపూర్ణమ్మ, ఫిష్ వెంకట్ జబర్ దస్త్ ఫణి, నాగిరెడ్డి. బస్ స్టాప్ కోటేశ్వర రావు, మాధవి, వేములూరి రాజశేఖర్, హరి తదితరులు
టెక్నికల్ టీం :
నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్
రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్
డివోపీ: ఎంఎస్ కిరణ్ కుమార్
సంగీతం : ఎంఎల్ పి రాజా
ఆర్ఆర్ : చిన్నా
ఎడిటర్ : నందమూరి హరి