నితిన్ చిత్రం జూన్ విడుదల
నితిన్, మేర్లపాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6 ఫిల్మ్ జూన్ 11 విడుదల
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది.
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఈ ప్రొడక్షన్ నంబర్ 6 రిలీజ్ డేట్‌ను ఈరోజు ప్రకటించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని జూన్ 11న విడుదల చేయనున్నారు. హీరో నితిన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసి, “JUNE 11th is the Date!! #Nithiin30” అని ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లో ఆయన పియానో వాయిస్తూ కనిపిస్తున్నారు.
తమన్నా భాటియా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు.
నితిన్ మునుపటి చిత్రం ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ కావడంతో ‘నితిన్30’పై అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని అందుకొనే రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ.
‘భీష్మ’ మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు.
అన్నింటికీ మించి, ఇదివరకు ఎప్పుడూ చేయని విలక్షణ పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు నితిన్.
రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:
నితిన్, నభా నటేష్, తమన్నా భాటియా, నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్-డైరెక్షన్: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్: సాహి సురేష్