నిన్నిలా నిన్నిలా మూవీ రివ్యూ

Published On: February 28, 2021   |   Posted By:

నిన్నిలా నిన్నిలా మూవీ రివ్యూ

అలలా..కలలా..: నిత్యా మీనన్ ‘నిన్నిలా నిన్నిలా’ రివ్యూ
Rating:2.5/5


ట్రైలర్ చూడగానే ఇది అసలు తెలుగు స్ట్రైయిట్ సినిమానా లేక ఏదైనా డబ్బింగా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే హీరో తమిళయన్,..హీరోయిన్ నిత్యామీనన్ మళయాళి..డైరక్టర్ మళయాళి, విజువల్స్ మన తెలుగు సినిమాలా అనిపించవు. కానీ మన తెలుగు నిర్మాత  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ ప్రొడ్యూసర్ కావటం, కమిడియన్ సత్య, బ్రహ్మాజీ ఉండటం, పెళ్లిచూపులు అమ్మాయి రీతూ వర్మ కూడా ఇందులో ఉందని తెలియటంతో చూడాలనే ఆలోచన పుడుతుంది. అయితే ఈ సినిమా స్ట్రైయిట్ రిలీజ్ కాకుండా ఓటిటిలో విడుదలైంది. ఈ నేఫధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది. అసలు చూడదగ్గ సినిమానేనా, కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఉద్యోగ నిమిత్తం ఈ మధ్యనే లండన్ వెళ్లిన దేవ్ (అశోక్ సెల్వన్) ఎప్పుడూ ఏదో ఒక లోకంలో ఉంటూంటాడు. కాస్త బద్దకస్తుడులా కనిపిస్తాడు. బద్దకాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద బొజ్జ,బరువు. ఇవి చాలదన్నట్లు muscle spasms అనే అప్పుడప్పుడూ కండరాలు పట్టు వదిలేస్తూ ప్రక్కకు పడిపోయే శరీరం, నిద్రాపట్టదు. పోనీ ఇన్ని సమస్యలు ఉన్నాయి.అతనేమన్నా ముసలోడా అంటే ముప్పైల్లోనే ఉన్నాడు. సర్లే ఇవన్ని ప్రక్కన పెడితే అతను చేరిన ఉద్యోగం ఓ రెస్టారెంట్ లో చెఫ్ గా. అక్కడ కోలీగ్ లు కమిడియన్ సత్య, తార (రీతూ వర్మ), ఇంకా మరికొందరు విదేశస్తులు. ఆ రెస్టారెంట్ ఓనర్ నాజర్. అంతా బాగానే ఉంది కానీ జీవితంలో ఏదో బోర్,నిరాశ. అయితే అవతల తారది అదే పరిస్దితి. అయితే తారకు ఓసీడి కంప్లైంట్. శానిటైజర్స్ తో చేతులు కడుక్కుంటూ జీవితం గడిపేస్తుంది. అయితే దేవ్ వంటలు వాసన చూసి అది బాగుందో లేదో చెప్పేయగలడు. అదే అతని స్పెషాలిటీ. దాంతో అతను అందరికీ నచ్చేస్తాడు.

అఫ్ కోర్స్ ఎప్పుడూ సీరియస్ గా ఉండే ఓనర్ నాజర్ గారికి కూడా. అయితే తారకు ఇవేమీ గిట్టవు. కానీ వీళ్లిద్దరూ ఒకటవ్వాలని రాసిపెట్టి ఉందేమో ఓ రోజు వీళ్లిద్దరూ కలిసి కిచెన్ లో ఇరుక్కుపోతారు. అక్కడనుంచి ఇద్దరూ తమ గతాలు గుర్తు చేసుకుంటారు. మన హీరో దేవ్ గతంలో మాయ(నిత్యామీనన్) ఉంది. ఆమె గురించి విన్నాక తారకు అతనిపై సానుభూతి ఏర్పడుతుంది. దేవ్ ఇప్పటి పరిస్దితికు కారణం ఆమే అని అర్దమవుతుంది. అలాగే తార గురించిన ఓ విషయం కూడా దేవ్ కు రివీల్ అవుతుంది. ఇంతకీ మాయ ఎవరు, దేవ్ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి…తార కు ఉన్న అసలు సమస్య ఏమిటి..దాన్ని అధిగమించగలిగిందా, దేవ్ జీవితం ఓ కొలిక్కి వచ్చిందా…అసలు నువ్విలా..నువ్విలా అనటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కు కాస్తంత ఎక్కువ బరువు, దానికి తోడు muscle spasms అనే నరాల బలహీనత, ఇవన్నీచాలదన్నట్లు రాత్రిళ్లు నిద్ర పట్టనివ్వని ఇన్సోమ్నియా. చిన్న వయస్సులోనే ఇన్ని సమస్యలు ఉన్న ఇతన్ని చూసి కొలీగ్స్ జాలి పడుతూంటారు. ఇంతకి ఇతను ఎవరూ అంటే ..ఓ చెఫ్. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లి అక్కడ చాలా పాపులర్ అయిన అమరా అనే పేరు గల రెస్టారెంట్ లో జాయిన్ అవుతాడు. అతను అక్కడ చేరటానికి కొద్ది కాలం ముందే తార(రీతూ వర్మ) చెఫ్ గా చేస్తూంటుంది. ఆమెకు ఓసీడి సమస్య. అదే మహానుభావుడులో శర్వానంద్ కు ఉందే అతి పరిశుభ్రత టైప్ సమస్య. ఆ హోటల్ ని నడిపే నాసర్ ది మరో సమస్య. ఇలా ఎవరి సమస్యల్లో వాళ్లు జీవిస్తూ..ఆ హోటల్ లో ఆహార పదార్దాలు తయారు చేస్తూంటారు. ఈ క్రమంలో తార,దేవ్ మెల్లిమెల్లిగా దగ్గరవుతారు.

అయితే దేవ్ ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండటం తార గమనిస్తుంది. అయితే అడిగే సాహసం చేయదు. కానీ ఓ రోజు రాత్రి అనుకోకుండా డోర్స్ క్లోజ్ అయ్యి..వీళ్లిద్దరూ ఆ రెస్టారెంట్ లో ఇరుక్కుపోతారు. అప్పుడు వీళ్లిద్దరు ఒకరి మనస్సులు మరొకరు విప్పుకుంటారు. ప్లాష్ బ్యాక్ లు పంచుకుంటారు. ఆ ప్లాష్ బ్యాక్ లో నిత్యామీనన్ ఎంట్రి ఇస్తుంది. ఆమే హీరోకు ఉన్న సమస్యలకు కారణం అని తారకు అర్దమవుతుంది. అలాగే తారకు ఉన్న సమస్య , పరిష్కారం దేవ్ కు అర్దమవుతుంది. ఒకరి సమస్యలను ఒకరు ఎలా పరిష్కరించుకున్నారు. అసలు నిత్యామీనన్ ఎవరు..ఆమెతో దేవ్ కు ఉన్న రిలేషన్ ఏమిటి…చివరకు ఈ కథ ఎలాంటి ముగింపు తీసుకుంటుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

నేపధ్యం సినిమాకు ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో, దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్లు తక్కువ మందే ఉంటారు. నేపధ్యం కొత్తగా ఉంటే పాత కథ అయినా కొత్తగా అనిపిస్తుంది. అదే సమయంలో నేపధ్యం చెత్తగా అనిపిస్తే ఎంత గొప్ప కథ అయినా రొట్ట కథైపోతుంది. ఈ విషయం తెలిసిన దర్శకుడు చాలా జాగ్రత్తగా తన కథకు నేపధ్యం ఎంచుకుంటారు. ఎందుకంటే దర్శకుడు నేపధ్యం గొప్పగా అనిపించవచ్చు…కానీ  చూసే ప్రేక్షకుడుకి ఆ నేపధ్యం విసుగెత్తిస్తే చేసేదేమి ఉండదు. అది మనకు చాలా సినిమాల్లో ప్రూవ్ అయిన విషయమే.  చెక్ సినిమాలో ఎక్కువ భాగం జైల్లో నడిచినట్లు…ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ రెస్టారెంట్ కిచెన్ లో నడుస్తుంది. అయితే ఇక్కడ కిచెన్ లేకపోతే అసలు కథే లేదు. కథలో భాగంగా కిచెన్ రాలేదు. కిచెన్ ఉంది కాబట్టే కథ వచ్చిందనిపిస్తుంది. అలాగే ఫుడ్ మీదా రిలేషన్ షిప్స్ మీదా ఓ అందమైన కవిత రాసినట్లుగా డైరక్టర్ ఈ సినిమాని తీర్చిదిద్దాడు. సినిమా స్లో పేస్ లో నడవచ్చు కానీ ఇలాంటి కథలకు తప్పదేమో అనిపిస్తుంది. డైరక్టర్ కొంచెం స్పీడప్ చేయచ్చు అనిపిస్తుంది. అయితే స్పీడులో బ్యూటీ కూడా మిస్సయ్యే అవకాసం ఉంది.
 
టెక్నికల్ గా …
ఈ సినిమాకు కెమెరా వర్క్ అద్బుతంగా కుదిరింది. విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ కూడా చాలా నీట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,పాటలు బాగున్నాయి. ఇక మెయిన్ క్యారక్టర్స్ ఫెరఫార్మెన్స్ అయితే సూపర్బ్. డైరక్టర్ కొత్త వాడైనా ఎక్కడా తగ్గకుండా సినిమాని ఓ పెయింటింగ్ లా చెక్కే ప్రయత్నం చేసాడు. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా మెచ్చుకోవాలి. ఎడిటింగ్ కూడా బాగుంది.

నటీనటుల్లో ..
 నిత్య మీనన్ పోషించిన మాయ పాత్ర చాలా కాలం మనకు గుర్తుండిపోతుంది. ఆ పాత్రలో జీవించింది. రీతువర్మకు పెళ్లి చూపులు తర్వాత  మళ్ళీ మంచి క్యారక్టర్. నాజర్, కేదార్ శంకర్, సత్యలు సినిమాకి మంచి వైబ్ ను యాడ్ చేశారనటంలో సందేహం లేదు. “భద్రమ్, పిజ్జా 2” వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు అశోక్ సెల్వన్ . అతను నటుడిగా చూపించిన వేరియెషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. ఓ స్నేహితుడిగా, ప్రేమికుడిగా అశోక్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు.  

చూడచ్చా..
మీకు ఫుడ్ లవర్స్ అయినా లేదా క్యూట్ లవ్ స్టోరీల లవర్స్ అయినా, పోనీ నిత్యామీనన్ అభిమానులైనా ఈ సినిమా నచ్చేస్తుంది.

తెర వెనక..ముందు

బ్యానర్ : శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌
న‌టీన‌టులు: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ, నాజర్‌ త‌దిత‌రులు
 సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి
సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు: శ్రీమ‌ణి
డైలాగ్స్‌: నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
కథ,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి
 ఓటీటి:జీ ప్లెక్స్‌
రన్ టైమ్: 1గం|| 58ని||
విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2021