Reading Time: < 1 min

నిర్మాత డిఎస్.రావు ఇంటర్వ్యూ

శివ 143 నాకు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది – నిర్మాత డిఎస్.రావు
నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసిన డి.ఎస్.రావు వరుసగా సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆయన శివ 143 సినిమాలో విలన్ గా నటించాడు. ఫిబ్రవరి14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంలో ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ…
నేను ఒకసారి మీటింగ్ లో ఉండగా డైరెక్టర్ తేజ గారు నన్ను చూసి నా నెక్స్ట్ సినిమాలో విలన్ నువ్వే అన్నారు, ఆచ్చర్యపోయి నిజమేనా అని ఆయన్ని అడిగాను, అలా మొదటిసారి హోరా హోరీ సినిమాలో విలన్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. 
ఆ సినిమా తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాను. ఇప్పటికి 30 పైగా చిత్రాల్లో నటించాను. మంచి పాత్రల్లో నటిస్తున్నాను, ఈ ఏడాదిలో నిర్మాతగా ఒక పెద్ద సినిమా చెయ్యబోతున్నాను. 
రామసత్యనారాయణ గారి శివ 143 సినిమాలో మంచి పాత్ర చేసాను, విలన్ గా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ శైలేష్ సాగర్ మంచి కథ రాసుకున్నాడు, సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న  విడుదల కానున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. 
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సహకారంతో నిర్మతగా మారాను. బోయపాటి శ్రీను, పూరి జగన్నాధ్ వంటి దర్శకులతో పని చెయ్యాలని ఉంది. త్వరలో వారి సినిమాల్లో నటిస్తాను. మంచి సినిమాలు చెయ్యాలనే సంకల్పంతో ఉన్నాను. త్వరలో నా భవిషత్తు సినిమాలు తెలియజేస్తానని ఇంటర్వ్యూ ముగించారు.