Reading Time: 2 mins

నిర్మాత బొమ్మకు శివ ఇంటర్వ్యూ

105 మినిట్స్ ఒక మంచి ఎక్స్పరిమెంటల్ మూవీ, జనవరి 26న ప్రేక్షకుల ముందుకు బొమ్మకు శివ, సుమన్

మీ నేటివ్ ప్లేస్ అండ్ నిర్మాత కాకముందు మీరేం చేశారు?
పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ బోడుప్పల్ లో. రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్ లు ఉన్నాయి.

సినిమా రంగంలోకి ఎలా వచ్చారు నిర్మాతగా ఎలా మారారు?
సినిమాలంటే నాకు చాలా ప్యాషన్. ఎప్పటికన్నా ఒక సినిమా నిర్మించాలని కల ఉండింది అది సినిమాతో నెరవేరింది.

ఈ సినిమా కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
రాజు నాతో 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఈ కథ విన్నప్పటి నుంచి కథ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైంది. ఫస్ట్ సినిమా చేస్తే ఈ కథతోనే చేయాలనుకున్నాను.

హన్సిక గారిని అనుకున్నారా ముందు? హన్సిక గారిని ఎలా అప్రోచ్ అయ్యారు?
ముందు వేరే హీరోయిన్ అనుకున్నాము. తర్వాత ఈ కథకి హన్సిక సెట్ అవుతారని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయి ఒప్పుకున్నారు.

సినిమా మీద ప్యాషన్ అన్నారు కమర్షియల్ సినిమా కాకుండా 105 మినిట్స్ అని ఎక్స్పెరిమెంటల్ మూవీతో ఎందుకు వస్తున్నారు?
ఒక కొత్త జోనర్ కొత్త ఎక్స్పరిమెంట్ తో రావాలనుకున్నాం అందుకే 105 మినిట్స్ కథ ని ఎంచుకున్నాం.

ఈ కథలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్స్ ఏంటి? సినిమా ఎన్ని డేస్ షూట్ చేశారు?
సింగిల్ ఆర్టిస్ట్ సింగిల్ టేక్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. నార్మల్ గా షూట్ కి 20 డేస్ పడితే ట్రైలర్ దాని ప్రాక్టీస్ చేసుకుని చేయడానికి 45 డేస్ పట్టింది.

హన్సిక గారు స్టార్ హీరోయిన్ గ్లామర్ డాల్ ఈ కథకి ఎలా ఒప్పించడం జరిగింది?
గ్లామర్ డాల్ కాబట్టే కొత్తగా చూపించాలి అనుకున్నాం హన్సిక గారు కూడా చేస్తాను అని ఒప్పుకోవడం చాలా పాజిటివ్ గా అనిపించింది.

సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ ఆ వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా?
సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ కానీ ఇంకో వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న యాక్టర్ హిందీలో మంచి నటుడు. ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.

రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ప్లాన్ చేశారు?
మైత్రి వాళ్లకి సినిమా ఇచ్చాము వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారా?
ప్రెసెంట్ వరల్డ్ వైడ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాము మంత్ కి ఒక లాంగ్వేజ్ చొప్పున నెక్స్ట్ ఫైవ్ మంత్స్ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తాం.

సినిమాకి ఇంటర్వెల్ ఏమన్నా ఉందా కంటిన్యూగా 105 మినిట్స్ ప్లే చేస్తున్నారా?
మేమైతే ఇంటర్వెల్స్ ఏమి ప్లాన్ చేయలేదు కానీ థియేటర్ వాళ్ళు వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు.

సినిమా అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?
సినిమా అనుకున్న బడ్జెట్లోనే తీసాము 3 కోట్లు అనుకున్నాము 3.5 కోట్లు దాకా అయింది.

జనవరి 26 న 105 మినిట్స్ సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాము మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.