నివాసి చిత్రం విలేకరుల సమావేశం
ఎక్స్ట్రాడనరీ ఎమోషనల్ డ్రామా నివాసీ- శేఖర్ వర్మ
‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ ఫేం శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా…. సతీష్ రేగళ్ళని దర్శకుడు గా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘నివాసి’. గాయత్రి ప్రొడక్షన్స్, దత్తాత్రేయా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్. వర్మ లు సంయుక్తగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని 23వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
నివాసీ జర్నీ ఫేస్ మూవీ. ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామా. నేను గతంలో నటించిన శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట చిత్రంలో కూడా ఎమోషన్ చిత్రమే కాకపోతే అందులో వేరే ఎమోషన్ ఇందులో వేరే ఎమోషన్ ఉంటుంది. ఈ చిత్రానికి నివాసీ అనే టైటిల్ పెట్టడానికి ముఖ్యకారణం. ఒక ఎన్ ఆర ఐ ఇండియా వచ్చి తన మూలాలను వెతుక్కునే పనిలో ఉంటాడు అందువల్ల ఆ టైటిల్‌ని ఖరారు చేశారు. తన నివాసాన్ని ఎతకుంటూ ఉంటాడు కాబట్టి నివాసి అని వచ్చింకది. నా పాత్ర పేరు వివాన్ ఆదిత్య. వివాన్ ఆదిత్యకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఆదిత్య అంటే సన్ ఆఫ్ గాడ్. వివాన్ అంటే సంపూర్ణం అని అర్ధం వస్తది. సంపూర్ణమైన జీవితం ఉన్నవాడిని వివాన్ అంటారు. అది సినిమాలో చెబుతాం. ఈ చిత్రంలో ప్రతి పాత్ర పేరుకి ఒక మంచి మీనింగ్ ఉంటుంది. అలా ఉండేలా పెట్టాం. ఇందులో నేను ఒక ఎన్ ఆర్ ఐ లాగా కనిపిస్తాను. ఒక తండ్రి తన కొడుకుని కష్టమనేది తెలియకుండా ఒక గాజుబొమ్మలాగా పెంచుతాడు. తర్వాత తనకు జీవితమంటే ఏంటో తెలియాలి అన్న నేపథ్యంలో ఇండియాకి తీసుకెళ్ళి కొన్ని కండీషన్స్ పెట్టి అక్కడ ఉండమని వదిలేస్తాడు. ఈ నేపథ్యంలో కథ మొత్తం సాగుతుంది. పూర్వం రాజులకథలు ఉంటాయి. ఒక రాజు తన కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పడానికి రాజ్యమంతా తిరిగిరమ్మంటాడు అప్పుడు పట్టాభిషేకం చేస్తాడు సేమ్ కాన్సెప్ట్ ఈ కథ. పిల్లజమిందార్, ఎబిసిడి అలా డబ్బు విలువ తెలుసుకునే కథ కాదు ఇది ఎక్కువగా ఎమోషన్స్ మీద బేస్ అయి ఉన్న కథ. కేవలం మూలాలు తెలుసుకునే పని. నేను పుట్టింది పల్లెటూరులో కాని పెరిగిందంతా వేరే కంట్రీస్‌లో ఆ మూలం తెలుసుకోవడం తల్లిదండ్రుల ఎమోషనల్ డ్రామా ఇది. అలా వెళుతూ ఉండా సాగే జీవితం కథ అప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ హీరోకి తెలుస్తాయి. పూర్తిగా పరిపూర్ణమయ్యాక అర్ధమవుతుంది. తమిళ్ జయ్‌ప్రకాష్ నా తండ్రి పాత్రలో కనిపిస్తారు. సుదర్శన్ వచ్చి సినిమా అంతా ఉంటారు. లవ్, ఫ్రెండ్షిప్, సోషల్ సర్వీస్, మెసేజ్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. నాకు ప్రత్యేకించి బ్యాక్ గ్రౌండ్ లేదు. నాది కాకినాడలో గొల్లపాలెం. సినిమా ఇండస్ట్రీకి శ్రీకృష్ణుడింట శ్రీరాముడంట చిత్రం ద్వారా వచ్చాను. బాలయ్యగారి జయ్సింహాలో కూడా ఒక క్యారెక్టర్ని చేశాను. ఇందులో మెయిన్ లీడ్ చేస్తున్నా నా తర్వాత చిత్రం అంగుళిక, యుగన్ లో నటిస్తున్నాను. హీరోయిన్ వివ్య చేసింది. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ సతీష్ వేగళ్ళ కూడా చాలా బాగా తీశారు. ఆయన నేను ఫ్రెండ్స్. నేను ఎమోషన్ని బాగా పండించగలను. నాకు అది బాగా కంఫర్ట్ జోన్‌గా అనిపిస్తుంది. యాక్టింగ్‌కి ఇన్స్పిరేషన్ అంటే రజనీకాంత్‌గారంటే చాలా ఇష్టం. ఆయన నటనంటే ఇష్టం. అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఎన్నుకునే జోనర్స్ అన్నీ చాలా జాగ్రత్తగా నీట్‌గా ఎంచుకుంటున్నాను. నేను ప్రస్తుతం యాక్షన్ సినిమాలను చేస్తున్నాను. అంగుళికలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి. యుగన్ యాక్షన్ మూవీ, తెలుగు, తమిళ్ మూవీ. ప్రియమణి పదినిమిషాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది . హీరోగానే కాక నెగిటివ్ షేడ్ పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధంగానే ఉన్నా అని ముగించారు.