నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ అవైటెడ్ అంథాలజీ నవరస రిలీజ్ డేట్
తొమ్మిది కథల సమాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అందరిలో ఆసక్తి కలిగించిన అంథాలజీ ‘నవరస’. ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో ఈ అంథాలజీ ఫిల్మ్ రూపొందింది. మానవ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని నవరసాలు అని కూడా అంటాం. (కోపం, ధైర్యం, కరుణ, అసహ్యం, భయం, వినోదం, ప్రేమ, శాంతి, ఆశ్చర్యపోవడం) వీటి ఆధారంగా ‘నవరస’ రూపొందింది. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ అంథాలజీని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగస్ట్ 6న విడుదలచేస్తోంది.
‘నవరస’ అంథాలజీ తమిళ సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక గర్వకారణంగానూ, అద్భుతంగా..మైలురాయిగా నిలవనుంది. అందుకు కారణం అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఈ అంథాలజీ రూపకల్పన కోసం ముందుకు రావడమే. టాప్ మోస్ట్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణుల కలిసి ఈ అంథాలజీకి జీవం పోయడమే కాకుండా సాటిలేని ఓ కలను సాకారం చేశారు. తమిళ సినిమా రంగంలోని అద్భుతమైన సృజనాత్మకతను కలిగిన వారందరూ ఈ సినిమాకు పనిచేశారు. కొవిడ్ సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ఫిల్మ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న .. తొమ్మిది మంది స్టార్స్తోపాఉ అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్ మరియు వసంత సాయి దర్శకులుగా తిరుగులేని విజన్‌తో ‘నవరస’లోని ప్రతి రసాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ “పాండమిక్ నేపథ్యంలో నిధుల సమీకరణ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. కొవిడ్ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ చాలా ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి సిట్యువేషన్స్‌లో సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. అలాంటి బలమైన కోరికలో నుంచి నవరస పుట్టింది. ఈ ఆలోచనను ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు తెలియజేశాం. అందరూ వెంటనే తమ సుముఖతను తెలియజేశారు. కొవిడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మా టీమ్స్‌లో సభ్యులందరూ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ అంథాలజీలోని తొమ్మిది భాగాలను విజయవంతంగా పూర్తి చేశాం. ఇండస్ట్రీ కోసం ప్యాషన్, కమిట్మెంట్తో మేం చేసిన ఈ ప్రయత్నాన్ని 190 దేశాల్లోని ఆడియెన్స్ వీక్షించనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కోసం అందరూ మనసు పెట్టి కష్టపడ్డారు. అందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ అంథాలజీ విషయాన్ని రివీల్ చేయడానికి చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. మన ఇండస్ట్రీ టాలెంట్, క్రియేటివిటీకి నవరస నిదర్శనంగా నిలవనుంది. 12000 మంది సహోద్యోగులకు దీని ద్వారా సహకారాన్ని అందించబోతున్నాం. భూమిక ట్రస్ట్ ద్వారా మేం చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో భాగమైన నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం” అన్నారు.
తొమ్మిది కథల సమాహారంగా రూపొందించబడ్డ ‘నవరస’ టీజర్‌ను భరత్ బాలా రూపొందించారు. మనలోని భావోద్వేగాలను చాలా చక్కగా చిత్రీకరించారు.
‘నవరస’ వివరాలు:
టైటిల్ – ఎదిరి(కరుణ)
డైరెక్టర్ – బిజోయ్ నంబియార్
నటీనటులు – విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, రేవతి
టైటిల్ – సమ్మర్ ఆఫ్ 92(హాస్యం)
డైరెక్టర్ – ప్రియదర్శన్
నటీనటులు – యోగిబాబు, రమ్య నంబీశన్, నెడుమూడి వేణు
టైటిల్ – ప్రాజెక్ట్ అగ్ని(ఆశ్యర్యం)
డైరెక్టర్ – కార్తిక్ నరేన్
నటీనటులు – అరవందస్వామి, ప్రసన్న, పూర్ణ
టైటిల్ – పాయాసం(జుగుప్స)
డైరెక్టర్ – వసంత్ ఎస్ సాయి
నటీనటులు – డిల్లీ గణేశ్, రోహిణి, అదితి బాలన్, సెల్ఫీ కార్తీక్
టైటిల్ – పీస్(శాంతి)
డైరెక్టర్ – కార్తీక్ సుబ్బరాజ్
నటీనటులు – సింహ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాస్టర్ తరుణ్
టైటిల్ – రౌద్రం(కోపం)
డైరెక్టర్ – అరవింద్ సామి
నటీనటులు – రిత్విక, శ్రీరామ్, అభినయ శ్రీ, రమేశ్ తిలక్, గీతా కైలాసం
టైటిల్ – ఇన్మయ్(భయం)
డైరెక్టర్ – రతీంద్రన్ ఆర్.ప్రసాద్
నటీనటులు – సిద్ధార్థ్, పార్వతీ తిరువోతు
టైటిల్ – తునింత పిన్(ధైర్యం)
డైరెక్టర్ – ఎస్ ఆర్జున్
నటీనటులు – అథర్వ, అంజలి, కిశోర్
టైటిల్ – గిటార్ కంబి మేల్ నిండ్రు(ప్రేమ)
డైరెక్టర్ – గౌతమ్ వాసుదేవ్ మీనన్
నటీనటులు – సూర్య, ప్రయాగ రోస్ మార్టిన్