Reading Time: < 1 min

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2లో ట్రెండ్ అవుతున్న భజే వాయు వేగం మూవీ

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయు వేగం సినిమా జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అతి తక్కువ టైమ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం టాప్ 2 లో భజే వాయు వేగం సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతోంది.

భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో మంచి సక్సెస్ అందుకున్నభజే వాయు వేగం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ అదే సక్సెస్ రిపీట్ చేస్తోంది.

నటీనటులు :

కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) రధన్
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు