Reading Time: < 1 min

నైజాం పిల్లోడు చిత్రం మార్చ్ విడుదల

మార్చ్ 29న నైజాం పిల్లోడు   

జాతీయ బాడి బిల్డర్ బల్వాన్ హీరోగా, ప్రాచి అధికారి, మౌనిక హీరోయిన్లుగా  మజ్ను సోహ్రాబ్ మూవీస్ పతాకం పై ఎస్ ఎం ఎం ఖాజా దర్శకత్వంలో మజ్ను రెహానా బేగం నిర్మిస్తున్న చిత్రం నైజాం పిల్లోడు. టాకీ పార్ట్ పూర్తీ చేసుకుని ఒక్క పాట మినహా మిగతా కార్యక్రమాలు పూర్తయిన ఈ ఈ మార్చ్ 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను గురించి నిర్మాత రెహానా బేగం తెలియచేస్తూ .. ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రంలోని పాటలను శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదల చేసాం. ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం ద్వారా  సంగీత దర్శకుడు మజ్ను ని పరిచయం చేస్తున్నాం. అయన అద్భుతమైన బాణీలను సమకూర్చారు. దాంతో పాటు రి రికార్డింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. 

దర్శకుడు ఖాజా మాట్లాడుతూ .. దాదాపు 45 చిత్రాల్లో సోలో ఫైటర్ గా నటించిన బల్వాన్ హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రమిది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాం. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఉంటుంది. కామెడీ, హర్రర్, సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. అన్ని కార్యక్రమాలను పూర్తీ చేసి మార్చ్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

బల్వాన్, ప్రాచి అధికారి , మౌనిక, సంపత్ రాజ్, ఫిరోజ్, దిల్ రమేష్, శివ సత్యనారాయణ, జ్యోతి, మేఘన, రాణి, దీపికా  దేవి తదితరులు

కెమెరా : యాదగిరి. డాన్స్ : బ్రదర్ ఆనంద్. సంగీతం : ఎస్ కే మజ్ను. సమర్పణ : మజ్ను బ్రదర్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కే ఫిష్ లక్ష్మి. నిర్మాతలు : మజ్ను రెహానా బేగం, మజ్ను సోహ్రాబ్. ఆర్ట్, ఎడిటింగ్ , కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం : ఎస్ ఎం ఎం ఖాజా.