Reading Time: < 1 min

న‌వంబ‌ర్ 29న నిఖిల్  అర్జున్ సుర‌వ‌రం



యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో.. బ్యాన‌ర్‌పై  టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో  రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`.  దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. న‌వంబ‌ర్ 29న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌:  రాజ్‌కుమార్ అకెళ్ల‌
సంగీతం:  సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సూర్య‌
ఎడిట‌ర్:  న‌వీన్ నూలి
పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌