Reading Time: < 1 min

పంచతంత్రం చిత్రం నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు.

సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విహారి పాత్రలో నరేష్ అగస్త్య నటిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చిత్రంలో విహారి పాత్రలో అతను కనిపిస్తాడు. హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన అబ్బాయి పాత్రలో నరేష్ అగస్త్య అద్భుతంగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చూపును తనవైపు తిప్పుకొన్న అతను, విహారి పాత్రలో నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు” అని అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “విహారి… ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కార్పొరేట్ కంపెనీలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహరికి ఎదురయ్యే సమస్యలు, సందర్భాలు ఉంటాయి” అని చెప్పారు.

నటీనటులు:

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:

పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌,  ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి,  మాటలు: హర్ష పులిపాక – ‘కలర్‌ ఫొటో’ సందీప్‌ రాజ్‌, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక