పలాస 1978 చిత్రం చిత్రీకరణ ప్రారంభం
ఫిబ్రవరి 9న “పలాస 1978” చిత్రీకరణ ప్రారంభం.
“లండన్ బాబులు” ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం “పలాస 1978” . కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978” చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నానన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ..ఫిబ్రవరి 9 న చిత్రీకరణ ప్రారంభిస్తాము.పూర్తిగా ఆంధ్రా ప్రదేశ్ లొనె చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలిచిత్రమిది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్వహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. రియలిస్టిక్ మూవీగా ఈ చిత్రముంటుందని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాతలు: అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ కుమార్.
Attachments area