పలాస 1978 చిత్రం జనవరి రిలీజ్
గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ద్వారా విడుదల కానున్న ”పలాస 1978” చిత్రం
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ వరుసలో గీతా ఆర్ట్స్, యువి ప్రొడక్షన్స్ ”పలాస 1978” చిత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి.
ప్రకాశం జిల్లా పలాస లో జరిగిన యదార్థ సంఘటనలు, కొన్ని యదార్థ పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన ”పలాస 1978” చిత్రాన్ని GA2-UV సంస్థ ద్వారా విడుదల చేస్తున్నామని సంస్థ తరపున బన్నీ వాసు తెలిపారు.
పలాస చిత్రం అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీ లకు బాగా నచ్చింది. కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని, మంచి సినిమాలను అందరికీ చేరవెయ్యాలని అల్లు అరవింద్ భావించడంతో జనవరి చివరి వారంలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.
రక్షిత్, నక్షత్ర జటగా నటించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, విన్సెంట్ అరుల్ ఫొటోగ్రఫీ, రఘు కుంచె సంగీతం అందించారు. ఇప్పటికే సుకుమార్, మారుతి, పూరీ జగన్నాథ్ వంటి ప్రముఖ డైరెక్టర్లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం, గీతా ఆర్ట్స్, యువి వంటి పెద్ద సంస్థలు రిలీజ్ చేస్తుండటం, “పలాస 1978” సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.