పలాస1978 చిత్రo టీం కు అల్లు అర్జున్ అభినందన
రియలిస్టిక్ సినిమా పలాస 1978 తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. ఈ దర్శకుడిని మంచి సినిమా చేశారంటూ అభినందించారు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. పలాస 1978 చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు మొక్కను బహూకరించారు అల్లు అర్జున్.
మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.