Reading Time: < 1 min

పాన్ ఇండియా సినిమాలపై 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన RC స్టూడియో

కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్‌ల సరసన RC స్టూడియోస్ కూడా ఉంటుంది. వారు ఇటీవలె తీసిన మొదటి ప్రాజెక్ట్ కబ్జా చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆర్ చంద్రు కొత్త వెంచర్ ఆర్‌సి స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది.

ఆర్‌సి స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ప్రప్రథమంగా జరగనుంది.

ఈ చిత్రాలు గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, మిస్టర్ ఆనంద్ పండిట్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ వంటి వారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

RC స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల కోసం సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది. ఇండియన్ రియల్ స్టార్ శ్రీ ఉపేంద్ర కూడా ఈ శుభ వేడుకకు హాజరుకానున్నారు. మంగళవారం (జనవరి 23) సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులో ఈ కార్యక్రమం కోసం అతిరథ మహారథులు హాజరు కానున్నారు.