పాలిక్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం 2 చిత్రం ప్రారంభం
కొత్త నీరు, కొత్త తీరు సినీ పరిశ్రమకు ఎంతో అవసరం. ఎప్పటి కప్పుడు న్యూ టాలెంట్ ను వెలికితీస్తూ ఎంతో మంది నటీనటలకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరక్టర్ పాలిక్. తాజాగా తన దర్శకత్వంలో బియస్ ఆర్ కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడక్షన్ నెం-2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోగి సుధాకర్, రావుల రమేష్ నిర్మాతలు. ఈ చిత్రం ఈ రోజు ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ ముహూర్తపు న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అంద చేయగా దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూఇప్పటికే పాలిక్ గారి దర్శకత్వంలో రౌద్ర రూపాయ నమః చిత్రం నిర్మించాను. మొత్తం పూర్తయింది. అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక ఆయన దర్శకత్వంలోనే ప్రొడక్షన్ నెం-2 చిత్రం ప్రారంభించాము. ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ఉంటాయి. మిత్రుడు సుధాకర్ గారితో కలిసి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నా అన్నారు.
మరో నిర్మాత భోగి సుధాకర్ మాట్లాడుతూనేను టీచర్ ని, కథారచయితని. ఒక మంచి కథ రాసుకుని సినిమా చేద్దామనుకుంటున్న తరుణంలో నాకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉన్న పాలిక్ ని కలవడం జరిగింది. నా దగ్గర ఉన్న కథ వినిపించాను. తనకు బాగా నచ్చింది. ఈ క్రమంలో ఒక రోజు ఈ రోజు ప్రారంభించబోయే కథ గురించి చెప్పాడు. ఈ కథ కూడా నాకు విపరీతంగా నచ్చడంతో ముందు ఈ సినిమా చేసి తర్వాత నా కథతో సినిమా చేద్దాం అనుకున్నాం. ములుగు , వరంగల్ , అరకు ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఒక మంచి చిత్రంగా దీన్ని తెరకెక్కించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సీనియర్ ఆర్టిస్ట్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నా చిన్ననాటి మిత్రుడైన రమేష్ రావుల తో కలిసి నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తోటపల్లి సాయినాథ్ మాట్లాడుతూదర్శకుడు ఏడాది క్రితం పరిచయం అయ్యారు. క్రియేటివిటీ, కన్విక్షన్, కాన్ఫిడెన్స్ , కామన్ సెన్స్ ఇలా నాలుగు సిలు ఉన్న వ్యక్తి దర్శకుడు పాలిక్. ఈ కథ విన్నాను. మంచి పీరియాడికల్ స్టోరి. ఒక మంచి టీమ్ వర్క్ తో వస్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలన్నారు.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ మాట్లాడుతూపాలిక్ గారితో రౌద్ర రూపాయ నమః చిత్రం చేశాను. ఆయన వర్క్ , డెడికేషన్ చాలా నచ్చింది. పాలిక్ గారు తన నెక్ట్స్ సినిమాకు కూడా అవకాశం కల్పించడం చాలా సంతోషం అన్నారు.
గబ్బర్ సింగ్ బ్యాచ్ మాట్లాడుతూపాలిక్ గారు చేస్తోన్న ప్రతి సినిమాలో మాకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.
సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడుతూ పాలిక్ గారి డైరక్షన్ లో రౌద్ర రూపాయ నమః సినిమాకు మ్యూజిక్ చేశాను. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నటీనటులు ప్రమోద్, మోహన సిద్ధి, శ్రీమన్ మాట్లాడుతూ ఈ కథ చాలా గొప్పగా ఉంటుంది అందుకే ఈ సినిమా కోసం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము అని అన్నారు
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ. నిర్మాతే నాకు దేవుడు. కరోన సమయంలో ఎలాంటి అవకాశాలు లేని సమయంలో రావుల రమేష్ గారు నాతో రౌద్ర రూపాయ నమఃసినిమా నిర్మించారు. అది చాలా బాగొచ్చింది. ఇది రెండో సినిమా. నా మీద , నా కథ మీద నమ్మకంతో అవకాశం కల్పించారు. అలాగే మా ఊరి వాస్తవ్యులు, ఎంతో సుపరిచితులైన సుధాకర్ గారు దీనికి మరో నిర్మాత. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. కరోనాకి ముందు వెంచపల్లి చిత్రాన్ని ప్రారంభించాం. ఆ సమయంలోనే కాంతార సినిమా వచ్చింది. మా కథ కూడా కాంతార చిత్రం కథకి దగ్గరగా ఉండటంతో కథలో మార్పులు చేసి మళ్లీ కొత్తగా ఈ సినిమా ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త, పాత నటీనటులు నటిస్తున్నారు. నా ప్రతి సినిమా ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తాను. ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథకు ఆధారంగా తెరకెక్కించే పీరియాడిక్ మూవీ ఇది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలుంటాయి. జాన్ భూషణ్ అద్భుతమైన ఆరు పాటలు అందించారు. దానికి సురేష్ గంగుల సాహిత్యాన్ని సమకూర్చారు. కథే హీరోగా ఈ సినిమాని తెరకెకిస్తున్నాం. ఇందులో జీవా గారు అద్భతుమైన పాత్ర చేస్తున్నారు. అలాగే బాహుబలి ప్రభాకర్ గారు దొర పాత్రలో నటిస్తున్నారు. నాలుగు షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం. ఈ నెలలో మూడు పాటలు పిక్చరైజ్ చేసి..అలాగే వచ్చె నెలలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులతో పాటు తోటపల్లి సాయి నాథ్, సిరికొండ ప్రకాష్, గోడ జనార్థన్ , సిహెచ్ శ్రీనివాస్ అతిథలుగా పాల్గొన్నారు.
నటీనటులు:
బాహుబలి ప్రభాకర్, జీవ , సుమన్ శెట్టి, గుండు అశోక్, కుమార్, గబ్బర్ సింగ్ బ్యాచ్ , అనుశ్రీ, మోహన, సిద్ధి, రిషిక, మధు ప్రియ, శ్రీమాన్, ఆర్ ప్రమోద్, రఘు, రాంసింగ్, సిద్ధు, విజయ్ దేవ్
సాంకేతికవర్గం :
సంగీతం : జాన్ భూషన్
సిమాటోగ్రఫీః వెంకట్
ఎడిటర్ః నిషాంత్
నిర్మాతలుః భోగి సుధాకర్, రావుల రమేష్
కథ-స్క్రీన్ ప్లే -మాటలు-దర్శకత్వం : పాలిక్