Reading Time: 2 mins
పీన‌ట్ డైమండ్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
 
“పీన‌ట్ డైమండ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన హిట్ చిత్రాల దర్శకుడు మారుతి.
 
వెర్సటైల్ యాక్టర్ అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై  నవ దర్శకుడు వెంక‌టేష్ త్రిపర్ణ ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రం “పీన‌ట్ డైమండ్”. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హిట్ చిత్రాల దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. 
 
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. నాతోపాటు మా బ్యానర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడు.  టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా వుందనిపించింది. పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్ గా క్యూరియసిటీగా ఉంది. కథ లైన్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని. అలాంటి జోనర్లో సినిమా అంటే జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అప్పుడే మనం అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
నిర్మాత‌లు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ.. ‘ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా “పీనట్ డైమండ్” చిత్రం ఉంటుంది.  ఇప్పటివరకూ రాని ఓ సరికొత్త పాయింట్ ఇది. రెండు కాల‌మానాలకి సంబందించిన ఒక వైవిధ్యమైన క‌థాంశంతో ఆడియెన్స్ కి నచ్చేలా ఈ సినిమాని వెంకటేష్ తెరకెక్కించాడు. 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే.. దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతూ ఉంటుంది. ఆ రెండు క‌థ‌ల‌కి సంభందం ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది. అనేది మెయిన్ పాయింట్.  “పీన‌ట్ డైమండ్” టైటిల్ ఎందు‌కు పెట్టాం? అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. డెఫినెట్ గా ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా సినిమా ఉంటుంది. హైదరాబాద్,  త‌మిళ‌నాడు, కేర‌ళ‌, వైజాగ్ లలో షూటింగ్ జరిపామ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
 
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్, చాందిని త‌మిళరసన్ షేర్రీ అగర్వాల్, శాని సాల్మన్, సుమన్, శుభలేఖ సుధాకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
 
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోటియో,
ఎడిటర్; బస్వా పైడిరెడ్డి,
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; షాని సాల్మన్, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌, రాంబాబు పర్వతనేని, లైన్ ప్రొడ్యూసర్; శ్రీనిధి నక్కా, ప్రొడక్షన్ కంట్రోలర్; వాల్మీకి శ్రీనివాస్, నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,  త్రిప‌ర్ణ వెంకటేష్,
క‌థ‌-స్క్రీన్ ప్లే- మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం: త్రిప‌ర్ణ వెంకటేష్.