Reading Time: 5 mins

పులి మేక వెబ్ సిరీస్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌

జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ రూపొందించింన పులి మేక వంటి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది – ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్ట‌ర్ బాబీ

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది పులి మేక. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో కేక్ క‌ట్ చేసి కోన వెంక‌ట్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ చేశారు. ఈసంద‌ర్బంగా

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ కోనగారి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ప్రతి ఎపిసోడ్‌ను రిచ్‌గా, ఎగ్జ‌యిటింగ్ డిజైన్ చేసుకుంటూ వ‌చ్చారు. కోన‌గారు ఈ పాయింట్ అనుకున్న‌ప్పుడు డైరెక్ట‌ర్ చ‌క్రి పేరుని చెప్పాడు. త‌ను ఒప్పుకుంటాడో లేదోన‌ని అనుకున్నాను. కానీ త‌ను దీన్ని మంచి విజ‌న్‌తో అడాప్ట్ చేసుకుని తెర‌కెక్కించాడు. జీ 5 వాళ్లు అడిగిన‌వన్నీ స‌మ‌కూర్చారు. కోన‌గారికి, చ‌క్ర‌వ‌ర్తికి, టీమ్‌కు కావాల్సినంత ఫ్రీడ‌మ్ ఇచ్చారు కాబ‌ట్టి ఔట్ పుట్ బాగా వ‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటే పులి మేక సిరీస్ ఎంగేజ్ చేస్తుంద‌న‌డంలో డౌట్ లేద‌నిపిస్తుంది. లావ‌ణ్య త్రిపాఠి చాలా ప్యాష‌న్ ఉన్న యాక్ట్రెస్‌. అందాల రాక్ష‌సి ముందు నేను త‌న‌ని చూస్తూ వ‌చ్చాను. త‌న డేడికేష‌న్‌ని నేను ద‌గ్గ‌ర‌గా చూశాను. త‌ను డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్స్ చేసింది. త‌న‌కు అభినంద‌న‌లు. సాయికుమార్‌గారి కొడుకు ఆది ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. మంచి కంటెంట్‌ను న‌మ్మి చేసిన ఈ టీమ్‌కి పులి మేక హ్యూజ్ స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఛోటా కె.ప్ర‌సాద్‌, బ్ర‌హ్మ క‌డ‌లి స‌హా అందరికీ కంగ్రాట్స్‌ అన్నారు.

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ పులి మేకలో నటించిన లావణ్య, ఆది సాయికుమార్, రాజా సహా అందరికీ అభినందనలు. ట్రైలర్ చాలా బావుంది. నేను బేసిక్‌గా థ్రిల్ల‌ర్స్‌కి పెద్ద ఫ్యాన్‌ని. జీ 5 యాజ‌మాన్యం ఔట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్‌తో ఈ సిరీస్ చేయ‌టం మంచి ప‌రిణామం. ఆయ‌న మంచి రైట‌ర్‌, ప్రొడ్యూస‌రే కాదు మంచి వ్య‌క్తి కూడా. నేను క‌లిసిన బెస్ట్ ప‌ర్స‌న్స్‌లో త‌నొక‌రు. ఆయ‌న‌లాంటి వ్య‌క్తితో ప‌రిచయం అయినందుకు థాంక్స్‌. ఎంటైర్ పులి మేక టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

రైట‌ర్‌, నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ పులి మేక సిరీస్ గురించి మాట్లాడే ముందు కోవిడ్‌కి ఓ ర‌కంగా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే లాక్ డౌన్ స‌మ‌యంలో దాదాపు అన్నీ ఓటీటీల్లో సిరీస్‌ల‌ను చూసేశాం. కోవిడ్ ఓటీటీని మ‌న లైఫ్‌లో ఓ భాగం చేసేసింది. అంత మంచి కంటెంట్‌ను అందించిన వారికి థాంక్స్‌. అలాంటి వాటిని చూసిన త‌ర్వాత పులి మేక రాయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. స‌త్య‌తో రైట‌ర్‌గా జ‌ర్నీ స్టార్ట్ చేశాను. వాల్తేరు వీర‌య్య రైట‌ర్‌గా నా 55వ సినిమా. ఓ రైట‌ర్‌గా నేను ప‌ని చేసిన సినిమా రిలీజ్ అయ్యే ప్ర‌తీ శుక్ర‌వారం పుడుతున్న‌ట్లు భావిస్తుంటాను. అదే నిజ‌మైన పుట్టిన‌రోజుగా భావిస్తుంటాను. నాలుగు నుంచి ఆరు గంట‌లు మ‌నల్ని కూర్చుని పెడుతున్నారంటే అందుకు కార‌ణం రైటింగ్. అలాంటి ఛాలెంజ్‌లో నుంచి పుట్టిందే పులి మేక‌. జీ 5వారికి ముందు నేను 10 నిమిషాలు మాత్రం చెప్ప‌గానే వాళ్లు వెంట‌నే చేసేద్దామ‌ని అన్నారు. అలా ఈ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. మ‌నం ఎంత బాగా రాసినా, దాన్ని క‌రెక్ట్‌గా తీసేవాళ్లు అందులో క‌రెక్ట్‌గా యాక్ట్ చేసేవాళ్లు ఉండాల‌ని నాకు తెలుసు.

కిర‌ణ్ ప్ర‌భ క్యారెక్ట‌రే ఇందులో మెయిన్ క్యారెక్ట‌ర్‌. ఐపీఎస్ ఆఫీస‌ర్ రోల్‌. అలాంటి ప‌వ‌ర్ఫుల్ రోల్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ హీరోయిన్ చేస్తే బావుంటుంద‌ని నాకు ఆలోచ‌న‌లోకి వ‌చ్చిన పేరు లావ‌ణ్య త్రిపాఠి. త‌న‌తో క‌లిసి వర్క్ చేసింది ఇందులోనే. అలాగే బ్రాహ్మ‌ణ క్యారెక్ట‌ర్ కుర్రాడి పాత్ర‌లో ఆది సాయికుమార్ న‌టించారు. ముందు సాయికుమార్‌కి కథ చెప్పి ఒప్పించాను. నాపై న‌మ్మ‌కంతోనే లావ‌ణ్య‌, ఆది ఇందులో యాక్ట్ చేశారు. అలాగే నేను ఏదైతే చెప్పానో దాన్ని 100 ప‌ర్సెంట్ తెర‌పైకి తీసుకొచ్చింది మాత్రం మా ద‌ర్శ‌కుడు చ‌క్రి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌నే డైరెక్ట్ చేశాడు. అయితే సిరీస్‌ను ఎలా తీయాల‌నేది ఓ ఆర్ట్‌. దాన్ని అత‌ను చ‌క్క‌గా ప‌ట్టుకున్నాడు. చాలా హార్డ్ వ‌ర్క్ చేశాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. మంచి ప‌ని కోసం అన్నీ ఎలాగైతే అన్నీ క‌లిసి వ‌స్తాయో ఈ సిరీస్ కోసం అలా అన్నీ క‌లిసి వ‌చ్చాయి. అద్భుత‌మైన బీజీఎం ఇచ్చిన ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్ ఇలా చాలా మంచి టీమ్ క‌లిసి ప‌ని చేసింది. బిగ్ బాస్ నుంచి సిరి, అవినాష్‌ను ఈ సిరీస్‌లో యాక్ట్ చేయించాను. అలాగే మా గురువుగారు సీతారామ‌శాస్త్రిగారితో ఉన్న అనుబంధం ఉండేది. దాన్ని రాజాను ఈ సిరీస్‌లో తీసుకోవ‌టం ద్వారా కాస్త తీర్చుకున్నాను. జీ 5వారు ఎక్స్‌ట్రార్డిన‌రీ స‌పోర్ట్ చేశారు. ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను ప్రారంభిస్తే లాస్ట్ ఎపిసోడ్ వ‌ర‌కు అప‌ర‌ని భావిస్తున్నాను. మా టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌గారికి, గ్లింప్స్ రిలీజ్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి థాంక్స్‌. రేపు ఈ షోను మీకు ఓ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకు వ‌స్తున్న నానిగారికి ముందుగానే థాంక్స్ చెబుతున్నాను. బాబీగారికి, సిద్ధుగారికి థాంక్స్‌. ఫిబ్ర‌వరి 24న మా సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు అన్నారు.

డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ మా పులి మేక టీమ్‌ని స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన బాబీగారికి, సిద్ధుగారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఇక సిరీస్ గురించి చెప్పాలంటే ముందు కోన వెంక‌ట్‌గారి గురించి చెప్పాలి. ఓ రోజు ఆయ‌న కాల్ చేస్తే వెళ్లాను. అప్పుడు పులి మేక సిరీస్ రాశాన‌ని, నెరేట్ చేస్తాను న‌చ్చితే డైరెక్ట్ చేయాల‌ని అన్నారు. నేను విన్నాను  న‌చ్చింది వెంట‌నే ఓకే చెప్పేశాను. షో ర‌న్న‌ర్ ఎలా ఉంటారో కోన‌గారు మాకు చూపించారు. యూనిట్ మొత్తాన్ని ప‌రిగెత్తించారు. మా టీమ్‌కు పిల్ల‌ర్‌గా నిలిచారు. ఆదిగారు ఇందులో ఫొరెన్సిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్‌లా క‌నిపించారు. లావ‌ణ్య త్రిపాఠిలో కిర‌ణ్ ప్ర‌భ పాత్ర‌లో జీవించింది. ఎలాంటి డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్స్‌లో నటించింది. సుమ‌న్‌గారి వంటి సీనియ‌ర్ న‌టుడిని డైరెక్ట్ చేయ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను.అలాగే ఇత‌ర నటీన‌టుల‌కు థాంక్స్‌. మా సినిమాటోగ్రాఫర్స్ రామ్ కె.మ‌హేష్‌గారికి, సూర్య‌గారికి థాంక్స్. అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ బ్ర‌హ్మ‌గారికి, ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కె.ల‌క్క‌రాజుగారికి థాంక్స్‌. ఆమేజింగ్ బీజీఎం ఇచ్చారు. నాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్‌. జీ 5 వారికి థాంక్స్‌ అన్నారు.

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ బాబీగారు, సిద్ధుగారు రావటంతో మా వేడుకకి ఓ గ్లోరి వచ్చింది. నటిగా నేను పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నాను.ఇక పులి మేక విష‌యానికి వ‌స్తే కోన‌గారు ఇలా ఓటీటీ కోసం స్టోరి రాసుకున్నాన‌ని, విన‌మ‌ని అన్నారు. నేను విన్నాను. ఆయ‌న నా పాత్ర పేరు కిర‌ణ్ ప్ర‌భ అని చెప్పి స్టార్ట్ చేయ‌గానే ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను. ఎందుకంటే కిర‌ణ్ మా అమ్మ‌గారి పేరు. త‌ర్వాత ఆది సాయికుమార్‌గారు మా సిరీస్‌లో భాగ‌మ‌య్యారు. త‌న‌కు థాంక్స్‌. నా పాత్ర‌ను చాలా హీరోయిక్‌గా చూపించారు. ఈ సిరీస్‌లో ప్ర‌తి ఎపిసోడ్‌లో హై ఉంటుంది. కోన‌గారు ప్ర‌తి ఎపిసోడ్‌ను ఆస‌క్తిక‌రంగా రాశారు. దాన్ని చ‌క్ర‌వ‌ర్తిగారు అంతే గొప్ప‌గా తెర‌కెక్కించారు. ఆయ‌న‌కు థాంక్స్‌. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్స్ రామ్‌, సూర్య‌గారికి, ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. ఈ జ‌ర్నీలో పార్ట్ అయిన జీ 5కి థాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 24 వ‌స్తున్న మా పులి మేక ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అన్నారు.

జీ 5 ఒరిజినల్ కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ పులి మేక అనేది మా కోనగారు క్రియేటివిటీ నుంచి వచ్చిన అడవి. ఇందులో పులి ఎవ‌రు, మేక ఎవ‌రు ? అనేది తెలుసుకోవాలంటే మా జీ 5ని స‌బ్ స్క్రైబ్ చేయండి. వెబ్ సిరీస్ అంటే మూస‌గా ఉండ‌దు. కోన‌గారి స్టైల్లో ఉండే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్. చ‌క్ర‌వ‌వ‌ర్తిగారు అద్భుతంగా డైరెక్ట్ చేస్తే లావ‌ణ్య‌గారు అంతే అద్భుతంగాం న‌టించారు. ఇక ఆదిగారు, హ‌ర్ష‌గారు ఇలా అంద‌రూ బాగా యాక్ట్ చేశారు. ప్ర‌తి ఎపిసోడ్‌లో ఓ ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్‌లా ప్ర‌తి ఎపిసోడ్ ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్‌గా ఉంటూనే ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో పులి మేక ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుందనే న‌మ్మ‌కం ఉంది. ప్ర‌తి నెల జీ 5లో మంచి కంటెంట్‌తో మీ ముందుకు వ‌స్తుంది. ప్ర‌తి ఏడాది ఓ సంక్రాంతి మాత్ర‌మే ఉంటుంది. కానీ జీ5కి స‌బ్‌స్క్రైబ్ అయితే ప్ర‌తి నెలా సంక్రాంతిలానే ఉంటుంది. ప్ర‌తి నెల మిమ్మ‌ల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. ఈ సిరీస్ సీజ‌న్ 2 కోసం మేం వెయిట్ చేస్తున్నాం అన్నారు.

సిరి హ‌న్మంత్ మాట్లాడుతూ కోన వెంకట్‌గారికి థాంక్స్‌. ఆయ‌న ఈ క్యారెక్ట‌ర్ రాసుకున్న త‌ర్వాత న‌న్ను పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. చ‌క్ర‌గారికి థాంక్స్‌. లావ‌ణ్య‌గారు, ఆది సాయికుమార్‌గారితో ఫ‌స్ట్ టైమ్ వ‌ర్క్ చేశాను. ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు, జీ5కి థాంక్స్‌ అన్నారు.

ముక్కు అవినాష్ మాట్లాడుతూ మా పులిమేక ఒరిజిన‌ల్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వ‌స్తున్న జీ 5కి థాంక్స్‌. కోన‌గారు అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ఇచ్చారు. బిగ్ బాస్‌ను ఫాలో అయ్యి మంచి పాత్ర‌ను ఇచ్చారు. అలాగే డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తిగారికి థాంక్స్‌. మా ఒరిజిన‌ల్‌కు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన బాబీగారికి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌గారికి థాంక్స్‌. ఈ సిరీస్‌లో ఆది సాయికుమార్ గారి అసిస్టెంట్‌గా న‌టించాను. కోన‌గారు నా పాత్ర‌లో మంచి ఫ‌న్‌, ఎమోష‌న్‌ను జ‌న‌రేట్ చేశారు. లావణ్యగారికి థాంక్స్. అన్నారు.

రాజా చెంబోలు మాట్లాడుతూ ఇంత మంచి సిరీస్ ప్లాన్ చేయ‌ట‌మే కాకుండా రూపొందించిన కోనం వెంక‌ట్‌గారికి థాంక్స్‌. అలాగే లావ‌ణ్య‌, ఆది సాయికుమార్ స‌హా మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. జీ 5 స‌హా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాణిక్య రెడ్డి, వాసు, మ‌యాంక్‌, ధ‌ర‌ణి, సాయిశ్రీనివాస్, ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌టీన‌టులు:

కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, రాజాగా క‌రుణాక‌ర్ శ‌ర్మ, సిరిగా ప‌ల్ల‌వి, ఆది సాయికుమార్ అసిస్టెంట్ పాత్రలో ముక్కు అవినాష్, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పంద‌న‌గా ప‌ల్ల‌వి శ్వేత న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె
సినిమాటోగ్ర‌ఫీ: రామ్ కె.మ‌హేష్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌