పుష్ప ద రైజ్ సినిమా క్రిస్మస్ విడుదల

Published On: August 4, 2021   |   Posted By:

 

Image

పుష్ప ద రైజ్ సినిమా క్రిస్మస్ విడుదల

క్రిస్మస్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ద రైజ్ విడుదల


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
 
పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప- ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప-ద రైజ్ థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
 
32
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
 
 
ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన

టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని వై రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్