పుష్ప సినిమా తొలి సింగిల్ ఆగస్టు 13 విడుదల

Published On: August 3, 2021   |   Posted By:

 

Image

పుష్ప సినిమా తొలి సింగిల్ ఆగస్టు 13 విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు.

 

సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

 

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం. హిందీలో విశాల్ దడ్లాని. కన్నడంలో విజయ్ ప్రకాష్. మలయాళంలో రాహుల్ నంబియార్. తమిళంలో బెన్నీ దయాల్. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు.

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన

టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని వై రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్