Reading Time: < 1 min

పెదకాపు 1 మూవీ సెప్టెంబర్ 29 రిలీజ్

విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 సెప్టెంబర్ 29న థియేట్రికల్ రిలీజ్

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1ని రూపొందిస్తున్నారు. అఖండ లాంటి మాసీవ్ బ్లాక్ బస్టర్ ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్.

పెదకాపు-1ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. దసరా పండుగ సందర్భంగా భారీ పోటీ వుండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్, పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

పెదకాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం. టీజర్‌లో హీరో క్యారెక్టర్ ఆర్క్ ఒక సామాన్యుడి నుండి ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా అతను చేసే పోరాటం వరకు అద్భుతంగా ప్రజంట్ చేశారు.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్.

నటీనటులు :

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్