పెళ్లి సంద‌D చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Published On: October 11, 2021   |   Posted By:
 
పెళ్లి సంద‌D చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ 
 
మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగిన ‘పెళ్లి సంద‌D’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ 
 
 
రోష‌న్‌, శ్రీలీల జంట‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఆధ్వ‌ర్యంలో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ మూవీని రాఘ‌వేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
 
ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది.
 
ఈ సంద‌ర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
ఈ సంద‌ర్భంగా…
 
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘నా యుద్ధభూమి నిర్మాత కృష్ణ‌మూర్తిగారికి ముందుగా నివాళులు అర్పిస్తున్నాను. 1996లో శ్రీకాంత్ హీరోగా చేసిన ‘పెళ్లి సంద‌డి’ సినిమా 175 రోజుల ఈవెంట్ విజ‌యవాడ‌లో జ‌రిగిన‌ప్పుడు దానికి నేనే చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అప్పుడు నా సినిమాలు నాలుగు వ‌రుస‌గా స‌క్సెస్ కాలేదు. దాంతో నేను కాస్త లో(డ‌ల్‌), లో ఉన్నాను. కానీ ప్రేక్ష‌కులు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు చూసిన త‌ర్వాత నాలో తెలియ‌ని ఉత్సాహం వ‌చ్చేసింది. నువ్వు కాస్త డ‌ల్‌గా ఉన్నావ‌నిపించింది. అందుక‌నే నిన్ను ఇక్క‌డ‌కు తీసుకొస్తే బావుంటుంద‌నిపించిద‌ని రాఘ‌వేంద్ర‌రావుగారు అన్న‌ప్పుడు నాలో తెలియ‌ని ఓ జోష్ వ‌చ్చింది. ఆ జోష్ త‌గ్గ‌లేదు. పాతికేళ్ల త‌ర్వాత మ‌రోసారి ఆయ‌న న‌న్ను ఈ పెళ్లి సంద‌డి సినిమాకు ఆహ్వానించి అదే ప్రేమానురాగాలు, ఆప్యాయ‌త‌ను చూపించారు. అభిమానులంద‌రి రుణం తీర్చుకోలేనిది. రాఘ‌వేంద్ర‌రావుగారితో నా అనుబంధం చెప్ప‌లేనిది. అప్ప‌ట్లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తే కానీ, ఓ సుస్థిర‌స్థానం ఉండ‌దు అనుకునేవాళ్లం. ఆయ‌న‌తో సినిమాలు చేసేవాళ్లం. అది ఆయ‌న మాకు ఇచ్చిన భ‌రోసా. కెరీర్ స్టార్టింగ్‌లో మోస‌గాడు అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను. కానీ, పూర్తిస్థాయి పాత్ర కావాల‌ని అనుకున్నాను. అప్పుడు 1995లో అడ‌విదొంగ సినిమా చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఎలాంటి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే. రామారావుగారు రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయిన త‌ర్వాత ఆస్థాయిలో సినిమాల‌కు క‌లెక్ష‌న్స్ ఉంటాయా?  లేవా? అని మీమాంస‌లో ఉన్న త‌రుణంలో, మ‌ళ్లీ అడ‌విదొంగ‌తో రికార్డ్స్ చూపించిన ఘ‌న‌త రాఘ‌వేంద్ర‌రావుగారికే ద‌క్కుతుంది. అందులో నేను భాగం కావ‌డ‌మ‌నేది అదృష్టంగా భావించాను. అప్పుడు నాకు ఢోకా లేదు అనే భ‌రోసా వ‌చ్చింది. అలా ప్ర‌తి ఆర్టిస్టుకి భ‌రోసానిచ్చి స్టార్ స్టేట‌స్‌నిచ్చే దిగ్‌ద‌ర్శ‌కులు రాఘ‌వేంద్ర‌రావుగారు. అందుకే ఆయ‌నంటే గురు భావ‌న ఉంటుంది. అంతే కాదు, ఆయ‌న న‌న్ను ఎప్పుడూ బాబాయ్ అని పిలుస్తుంటాడు. ఆ పిలుపు ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్ర‌తి సినిమాకు ఆయ‌న న‌న్ను ఎంక‌రేజ్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అడ‌విదొంగ సినిమా చేసేట‌ప్పుడు యాక్ష‌న్ సీన్స్‌ను ముందు రోజే ప్రాక్టీస్ చేసేవాడిని. అది చూసి బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్ బాబాయ్ అని మెచ్చుకునేవాడు. ఆ పిలుపు నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. అలాగే ఘ‌రానా మొగుడు సినిమా స‌మ‌యంలో డాల్ఫిన్ హోట‌ల్‌లో ప్ర‌భుదేవాగారితో బంగారు కోడిపెట్ట పాట‌ల‌ను షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చి రాత్రి స‌మ‌యంలో ప్రాక్టీస్ చేస్తుంటే నీకు అవ‌స‌ర‌మా అని అంటుండేవారు. అలా ఆయ‌న అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు..గొప్ప ద‌ర్శ‌కులు ఎంతో మంది ఉన్నా కూడా ఆయ‌న‌లా ప్రేమ‌ను చూపించే ద‌ర్శ‌కుడు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఆర్టిస్టులు అంద‌రినీ ఆయ‌నంత ప్రేమిస్తారు. నేటి ద‌ర్శ‌కులు కూడా అది నేర్చుకోగ‌లిగితే చాలా బావుంటుంది. స్వీట్ డైరెక్ట‌రే కాదు..రొమాంటిక్ ఆలోచ‌న ఉండే డైరెక్ట‌ర్ కూడా. పెళ్లి అయిన కొత్త‌లో మేటూ పాళెం నుంచి చెన్నై వ‌చ్చే ట్రైన్‌ను నేను, సురేఖ ఎక్కిన‌ప్పుడు ఆ ట్రెయిన్‌లో మాకోసం ఆయ‌న కూపే ఏర్పాటు చేశారు. దాన్ని శోభ‌నం రూమ్‌లాగా త‌యారు చేశారు. ఆయ‌న‌తో ఎన్నో స్వీట్ మెమొరీస్ ఉంటాయి. ఆయ‌న మ‌న‌సుని ఎక్స్‌రే తీస్తే ప‌దహారేళ్లే ఉంటాయి. ఆయ‌న తీసిన ప‌ద‌హ‌రేళ్లు సినిమా ద‌గ్గ‌రే మ‌న‌సు ఆగిపోయింది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో గౌరిగారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘పెళ్లి సంద‌D’ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా అప్ప‌టి శ్రీకాంత్ పెళ్లి సంద‌డి చిత్రంలా సంద‌డి చేస్తుంద‌ని భావిస్తున్నాను. కీర‌వాణిగారి అద్భుత‌మైన మ్యూజిక్‌, ఆర్ట్ డైరెక్ష‌న్ అన్ని ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని అనుకుంటున్నాను. హీరోయిన్ శ్రీలీలకు అభినంద‌న‌లు. నా చిర‌కాల మిత్రుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ వేడుక‌కి రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. హీరోలంద‌రి మ‌ధ్య‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటే ఇండ‌స్ట్రీలో ఇలా కొట్టుకోవ‌డాలు, మాట‌ల‌న‌టం, మాట‌ల‌నిపించుకోవ‌డం ఉండ‌దు క‌దా. ప‌ద‌వులు ఏదైనా తాత్కాలిక‌మే. వాటి కోసం మాట‌లు అన‌డం, అనిపించుకోవ‌డం.. చూస్తుంటే బాధ‌నిపిస్తుంది. అదెవ‌రైనా కానీ. నేను ఏ ఒక్క‌రినీ వేలు పెట్టి చూపించాల‌నుకోవ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ విజ్ఞ‌త‌తో ఉండండి. మ‌న ఆదిప‌త్యం చూపించుకోవ‌డానికి, ప్ర‌భావాన్ని చూపించుకోవ‌డానికి ఎదుటి వారిని కించ‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ను ఎక్క‌డ స్టార్ట్ అయ్యింది. వివాదాలు ఎక్క‌డ స్టార్ట్ అయ్యాయో తెలుసుకుని హోమియోప‌తి వైద్యంలా మూలాల్లోకి వెళ్లి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అలాంటి వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచితే అంద‌రూ బావుంటారు. అప్పుడది వ‌సుధైక కుటుంబం అవుతుంది. ఈ ‘పెళ్లి సంద‌D’ నాటి ‘పెళ్లి సంద‌డి’లా గొప్ప‌గా ఆడాల‌ని, ఆడుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 
 
 
 
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘పాతికేళ్ల ముందు వచ్చిన ‘పెళ్లి సంద‌డి’  వంటి క్లాసిక్ సినిమా వ‌చ్చింది. ఇన్నేళ్ల త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావుగారికి ఆధ్వ‌ర్యంలో గౌరి ద‌ర్శ‌క‌త్వంలో ‘పెళ్లి సంద‌D’ సినిమా రావ‌డం ఎంతో ఆనందాన్నిచ్చే విష‌యం. ట్రైల‌ర్ చాలా బావుంది. సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉంటుందనుకుంటున్నాను. ద‌స‌రాకు ద‌ర్శ‌కేంద్రుడు దుమ్ములేపేస్తాడ‌ని అనుకుంటున్నాను. క‌చ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. శ్రీలీల స‌హా ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు. 35 ఏళ్ల ముందు మా డైరెక్ట‌ర్‌గారు న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు అక్టోబ‌ర్ 15న మా డైరెక్ట‌ర్‌గారు యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి ద‌ర్శ‌కుడు మ‌న ఇండ‌స్ట్రీలో ఉండ‌టం మ‌న అదృష్టం. ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రినీ కంఫ‌ర్ట్ జోన్‌లో ఉంచుతారు. చాలా అరుదుగా ఉండే మ‌నుషుల్లో ఆయ‌నొక‌రు. యాక్ట‌ర్‌గానూ ఆయ‌న‌కు స‌క్సెస్‌లు రావాల‌ని కోరుకుంటున్నాను. ‘పెళ్లి సంద‌D’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 
 
 
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ‘‘ఆర్‌.కె బ్యాన‌ర్‌ను నా పేరు, నా బ్ర‌ద‌ర్ పేరు వ‌చ్చేలా పెట్టాను. ఈ బ్యాన‌ర్‌లో చిరంజీవిగారు, వెంక‌టేశ్‌గారు సినిమాలు చేశారు. బాహుబ‌లి సినిమాకు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ అని వేశారు. అయితే నాకు నా అన్న‌య్య కృష్ణ‌మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ అని ఓ సినిమా తీయాల‌ని ఉండింది. రెండేళ్ల ముందు ఆయ‌న ఆరోగ్యం బాగోలేదు. అప్పుడే ఈ సినిమా చేయాల‌ని స్టార్ట్ చేశాను. కానీ, క‌రోనా వ‌ల్ల కుద‌ర‌లేదు. అప్ప‌టికి తీసిన ఓ పాట‌ను ఆయ‌న‌కు చూపిస్తే, చిన్న‌పిల్లాడిలా ఎంజాయ్ చేసి చ‌ప్ప‌ట్లు కొట్టారు. నాన్న‌గారు హీరో కావాల‌నుకుని వ‌చ్చి డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాలో యాక్ట్ చేస్తాన‌ని చెప్పి వెళ్లి అన్న‌య్య‌ను క‌లిసి చెప్పి, నువ్వు నిర్మాత‌వి క‌దా, రెమ్యున‌రేష‌న్ ఇవ్వు అంటే ఆయ‌న చెక్ రాసిచ్చారు. నేను ఆ చెక్‌ను అలాగే నా ద‌గ్గ‌రే ఉంచుకున్నాను. అయితే ఈ పిక్చ‌ర్ చూడ‌కుండానే ఆయ‌న కాలం చేశారు. నాకెప్పుడూ న‌టించాల‌ని లేదు. ఓసారి వెంక‌టేశ్‌గారు, దిల్‌రాజుగారు అడిగితే కూడా చేయ‌లేదు. అయితే ‘పెళ్లి సంద‌D’ సినిమాలో చిన్న రోల్ చేశాను. అలాగే కొత్త హీరో హీరోయిన్ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేసేట‌ప్పుడు ఉండే కిక్కే వేరు. విక్ట‌రీ వెంక‌టేశ్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తిని నేనెప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. విక్ట‌రీ అనే పేరుని నిల‌బెట్టాడు. అలాగే నేనెంతో ప్రేమ‌గా బాబాయ్ అని పిలుచుకునే వ్య‌క్తి చిరంజీవిగారు.  మా ఇంట్లో ఫంక్ష‌న్ జ‌రిగినా త‌న‌నే ఫ‌స్ట్ పిలుస్తాను, వాళ్ల ఇంట్లో ఫంక్ష‌న్ జ‌రిగినా త‌ను న‌న్నే ఫ‌స్ట్ పిలుస్తాడు. ఎన్టీఆర్‌గారితో 12 సినిమాలు చేస్తే, చిరంజీవితో 14 సినిమాలు చేశాను. ఆ అవ‌కాశం ఇచ్చినందుకు త‌న‌కు థాంక్స్‌. 
 
 
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారి పుణ్యమాని ఓ సినిమాను 25 సంవ‌త్స‌రాల వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. ఆయ‌నకొచ్చిన చిరు కోపం నుంచి పుట్టిన సినిమానే ఇది. ఓసారి హీరోలు లేకుండా మీరు సినిమాలు చేయ‌లేర‌ని నేను వారితో అంటే మీ నిర్మాత‌ల‌కు ధైర్యం లేద‌య్యా అని రాఘ‌వేంద్ర‌రావుగార‌న్నారు. క‌థ ఉంటే తీసుకురండి అన్నాను. మ‌రుస‌టి రోజే ర‌మ్మ‌న్నారు. వెళితే, ఈ క‌థ చెప్పారు. నేను క‌థ విన్నంతసేపు ప‌డి ప‌డి న‌వ్వాను. సినిమా చేద్దామ‌న్నాను. అయితే మీరే సినిమా చేసి విడుద‌ల చేయాల‌నే కండీష‌న్‌తో సినిమాను స్టార్ట్ చేశారాయ‌న‌. దాంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ అయిన నేను, అశ్వ‌నీదత్, ఇత‌రులం నిర్మాత‌లుగా పెళ్లి సంద‌డి సినిమా చేశాం. నిర్మాత‌గా భారీ లాభాలు చూడ‌టం అదే తొలిసారి. అలాంటి చిన్న‌సినిమాల‌ను ఆద‌రించేలా చేసిన ద‌ర్శ‌కేంద్రుడికి థాంక్స్‌. హీరో శ్రీకాంత్ చాలా అమాయ‌కంగా ఉండేవాడు. తను ఇంత పెద్ద‌గా ఎదిగాడు. ఇప్పుడు త‌న కొడుకు రోష‌న్ సినిమా చేయ‌డం గొప్ప విష‌యం’’ అన్నారు. 
 
 
అశ్వినీద‌త్ మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారు, కీరవాణిగారే ఈ సినిమాకు హీరోలు. మా హీరో శ్రీకాంత్‌కు, దీప్తి భ‌ట్నాగ‌ర్‌, ర‌వళికి థాంక్స్‌. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోష‌న్ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుగారి ఆధ్వ‌ర్యంలో ‘పెళ్లి సంద‌D’ సినిమా చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం’’ అన్నారు. 
 
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘రోషన్‌ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవిగారికి, విక్ట‌రీ వెంక‌టేశ్‌గారికి ధ‌న్య‌వాదాలు. మా పెళ్లి సంద‌డి విడుద‌లై పాతికేళ్ల‌వుతుంది. మ‌ళ్లీ అదే టైటిల్‌తో రాఘ‌వేంద్ర‌రావుగారు సినిమా చేస్తాడ‌ని ఊహించ‌లేదు. రాఘ‌వేంద్ర‌రావుగారు ఓసారి రోష‌న్‌ను ఇంటికి తీసుకు ర‌మ్మంటే వెళ్లాను. ఆయ‌న హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేస్తాన‌ని అన్నారు. ఆయ‌న చేయి ఎంత మంచిదో అంద‌రికీ తెలుసు. త‌న‌కు రాఘ‌వేంద్ర‌రావుగారి డైరెక్ష‌న్ సినిమా చేస్తే ఫైట్స్‌, డాన్సులు, న‌ట‌న ఇలా అన్నింటిలో మంచి అవ‌గాహ‌న వ‌స్తుందని ఓకే అన్నాను. కాస్లిక్ మూవీగా వ‌చ్చిన పెళ్లి సంద‌డి పేరుతో సినిమా చేయ‌డం ముందు భ‌య‌మేసినా , రాఘ‌వేంద్రరావుగారున్నార‌నే న‌మ్మ‌కంతో ఓకే చేశాను. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. రోష‌న్‌కు మీ అంద‌రి ఆశీర్వాదం కావాలి. హీరోగా త‌న‌కు ఇది తొలి సినిమా. అక్టోబ‌ర్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది. మా ముందు జ‌న‌రేష‌న్‌లో అయినా, మా జ‌న‌రేష‌న్‌లో అయినా ఇన్‌స్పిరేస‌న్‌గా తీసుకునే వ్య‌క్తి అన్న‌య్య చిరంజీవిగారు. వాళ్ల హార్డ్ వ‌ర్క్‌ను అబ్జ‌ర్వ్ చెయ్‌… అన్నాను. స‌క్సెస్, ఫెయిల్యూర్స్‌ను ఒకేలా తీసుకోమ‌ని చెప్పాను. చిరంజీవిగారు వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న చేస్తున్న హార్డ్ వ‌ర్క్ చూసి మాలో కసి ఇంకా పెరుగుతుంది. ఆయ‌న్ని చూసి ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ హీరోలు చాలా నేర్చుకోవాలి. ఆయ‌న ఈ వేడుకకి వ‌చ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు. 
 
 
 
ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారు ఏం చేసినా ట్రెండ్ సెట్టింగ్ అవుతుందనడానికి నిదర్శనమే ఈ ‘పెళ్లి సంద‌D’. ఒకే నిర్మాతే సినిమాను ఎందుకు తీయాలి.. చాలా లో బ‌డ్జెట్‌లో ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు తీస్తే బావుంటుంది క‌దా.. అని రాఘ‌వేంద్ర‌రావుగారికి వ‌చ్చిన ఆలోచ‌న ట్రెండ్ సెట్టింగ్ అయ్యింది. విజ‌య‌యాత్ర అనే ట్రెండ్ సెట్టింగ్‌కు కూడా రాఘ‌వేంద్ర‌రావుగారే ఆద్యుడు. పాతికేళ్ల త‌ర్వాత మ‌రి కొంత మంది మిత్రులు క‌లిసి ‘పెళ్లి సంద‌D’ సినిమా చేస్తున్నారు. రోష‌న్‌, శ్రీలీల‌, డైరెక్ట‌ర్ గౌరిల‌కు ఈ సినిమా చాలా మంచి పేరు తేవాల‌ని, తెస్తుంద‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
 
ఆర్కామీడియా శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారికి, వెంక‌టేశ్‌గారికి థాంక్స్‌. రోష‌న్‌, శ్రీలీల‌, డైరెక్ట‌ర్ గౌరిగారికి, యాక్ట‌ర్‌గా డెబ్యూ చేస్తున్న రాఘ‌వేంద్ర‌రావు స‌హా ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 
 
 
దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావు చేసిన సినిమాలు, సాధించినన్ని విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆయ‌నలో ప‌ది శాతం సాధిస్తే చాలనిపిస్తుంది. ఎంతో మంది స్టార్స్‌ను పరిచ‌యం చేశారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఆయ‌న పేరు నిలిచిపోతుంది. న‌టుడిగా ఆయ‌న ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండ‌టం హ్యాపీగా ఉంది. ఈ సినిమా స్టోరిలో నేను కూడా భాగ‌మయ్యాను. ఆయ‌న డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌లేక‌పోయాన‌నే ఫీలింగ్ ఉంది. డైరెక్ట‌ర్ గౌరిగారికి, రోష‌న్‌, శ్రీలీల‌గారికి అభినంద‌న‌లు. పాతికేళ్ల త‌ర్వాత వ‌స్తున్న మ‌ళ్లీ వ‌స్తున్న‘పెళ్లి సంద‌D’ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 
 
 
హీరో రోషన్ మాట్లాడుతూ ‘‘నాన్నచేసిన సినిమాల్లో పెళ్లి సందడి చాలా పెద్ద హిట్. ఇప్పుడు అదే టైటిల్ ‘పెళ్లి సంద‌D’ తో మీ ముందుకు వ‌స్తున్నాను. కోవిడ్ స‌మ‌యంలో చాలా క‌ష్ట‌ప‌డి షూట్ చేశాం. టీమ్ ఎంతో బాగా కో ఆప‌రేట్ చేయ‌డంతో సేఫ్‌గా సినిమాను పూర్తి చేశాం. డైరెక్ట‌ర్ గౌరి అక్క‌.. డేడికేటివ్ ప‌ర్స‌న్‌. న్యూ ఫ్లేవ‌ర్ యాడ్ చేసి సినిమాను తెర‌కెక్కించారు. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సినిమాను  రాఘ‌వేంద్రరావుగారి అన్న‌య్య కృష్ణ‌మోహ‌న్‌రావుగారికి అంకితం చేస్తున్నాం. వెంక‌టేశ్‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నాకు బోర్ కొట్టిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న సినిమాలే చూస్తాను. ఆయ‌న ఈ వేడుక‌కి వ‌చ్చిన వెంక‌టేశ్‌గారికి థాంక్స్‌. ఇప్ప‌టి త‌రాల‌కే కాదు, త‌ర్వాత త‌రాలు కూడా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి. మా కుటుంబంతో ఆయ‌న‌కుండే అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. మా నాన్న‌కు ఆయ‌నంటే ఎంత ప్రేమో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌లోని ఫైర్‌ను చూసి ఎప్పుడూ ఇన్‌స్పైర్ అవుతుంటాను. ఆయ‌న‌కు థాంక్స్‌. కీర‌వాణిగారి మ్యూజిక్‌లో వ‌ర్క్ చేస్తాన‌ని అనుకోలేదు. ‘పెళ్లి సంద‌D’ తోనే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. రాఘ‌వేంద్ర‌రావుగారితో ప‌నిచేయ‌లేనేమోన‌ని అనుకున్నాను. కానీ ఆయ‌న ‘పెళ్లి సంద‌D’  సినిమాకు పిలిచి అవ‌కాశం ఇచ్చారు. ఎంత మాట్లాడిన త‌క్కువే. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. మా ‘పెళ్లి సంద‌D’  సినిమాను కూడా థియేట‌ర్స్‌లోనే చూడండి’’ అన్నారు. 
 
 
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ ‘‘మా ఈవెంట్‌కు వ‌చ్చిన చిరంజీవిగారు, వెంక‌టేశ్‌గారికి ధ‌న్య‌వాదాలు. రాఘ‌వేంద్ర‌రావుగారి గురించి మాట్లాడేటంత దాన్ని కాను. డైరెక్ట‌ర్ గౌరి అక్క‌.. రాక్ష‌సి. మొండిగా చేయించి ఔట్‌పుట్ రాబ‌ట్టుకుంది. రోషన్ మంచి కోస్టార్. మా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.