పెళ్లి సందD సినిమా సాంగ్ మిలియన్‌కి పైగా వ్యూస్
ప్రేమంటే ఏంటి..చల్లగా అల్లుకుంటది. మెల్లగా గిల్లుతుంటది. వెళ్లనే వెళ్లనంటది, విడిపోనంటుంది..’’ అంటూ ప్రేమ పాఠాలు వల్లిస్తున్న ఓ కొత్త జంట కథేమిటో తెలియాలంటే ‘ చూడాల్సిందే అంటున్నారు నిర్మాతలు.
రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసందD`. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.
రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి `ప్రేమంటే ఏంటి` అంటూ సాగే సోల్‌ఫుల్ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వరవాణి ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించారు. హరిచరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు.
ఆదిత్య మ్యూజిక్‌ద్వారా విడుదలైన ఈ పాట శ్రోతలని విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో 1మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – “‘పెళ్లి సందD’ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి` విడుదలైన కొన్ని గంటల్లోనే 1మిలియన్ కి పైగా వ్యూస్ రావడం, పాట మెలోడియస్ గా ఉండి విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి అని అప్రిసియేషన్ రావడం హ్యాపీగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ – “రాఘవేంద్రరావుగారు, కీరవాణిగారు కలిస్తే మ్యూజికల్‌గా మ్యాజిక్ అవుతుంది. ‘పెళ్లి సందD’ లో ప్రేమంటే ఏంటి సాంగ్ సూపర్‌హిట్ అయ్యి ఈ కాంబినేషన్ క్రేజ్‌ను మరోసారి చూపించింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఇలాగే సందడి చేస్తుంది“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిబాబా కోవెలమూడి మాట్లాడుతూ – “షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. అందరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా అందమైన రొమాంటిక్ సినిమాగా దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’ రూపొందుతోంది. ఈ కరోనా సిచ్యువేషన్స్ నుండి బయటపడి మాములు పరిస్థితులు రాగానే రిలీజ్ ప్లాన్ చేస్తాం. ఇది ఫ్యామిలి మెంబర్స్ అందరితో కలిసి థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ మూవీ“ అన్నారు.
రాఘవేంద్రరావు, కీరవాణి గార్ల కలయికలో మా సంస్థ నుండి మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ‘పెళ్లి సందD’ అని ఆదిత్య మ్యూజిక్ సంస్థవారు తెలిపారు.
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.