పోలీస్ వారి హెచ్చరిక మూవీ టైటిల్ లోగో విడుదల
దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న
పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు….!
ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ
ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది, వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని …ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్ అని, ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా మారి విజయాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు….! విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్ దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు….!
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ
సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని … తెలిపారు…!
తారాగణం :
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్, శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవింద, హనుమ, బాబురాం
సాంకేతిక వర్గం :
కెమెరా : నళినీ కాంత్
సంగీతం : గజ్వేల్ వేణు
ఎడిటర్ : శర్వాణి శివ
నిర్మాత : బెల్లి జనార్థన్,
రచన,దర్శకత్వం : బాబ్జీ