Reading Time: 2 mins

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఫోర్ ప్లే చిత్రం 

ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై బేబీ తనిష్క,జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా దర్శకుడు పి ప్రసాద్ ను తొలిసారిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “ఫోర్ ప్లే”

దర్శకుడు పి ప్రసాద్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని నూతన నటీనటులతో షూటింగ్ చేసాము. హీరోయిన్  హరిణి మాత్రం “పెచ్చెక్కిస్తా” చిత్రానికి హీరోయిన్ గా చేసింది. హీరో శ్యామ్, హీరోకి ఫ్రెండ్స్గగా శ్రీకాంత్, నితీన్ కొత్తవారిని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రం లో నటించిన మరొక హీరోయిన్ హారిక ఈ అమ్మాయి క్యారెక్టర్ చాల కొత్తగా రొమాంటిక్ గా ఉంటుంది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్నసంతోషాలకోసం ఎలా పెడదోవ పడుతున్నారో, ఇంటికి దీపం ఇల్లాలు గా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్ కు గురి కాపాడుతున్నారో, అలాకాకుండా డబ్బు,ఇతరత్రా విషయాలు జీవితంలో  తుచ్ఛమైనవిగా భావించి ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం.

ఈ చిత్రం లాక్ డౌన్ కారణాలవల్ల హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలలో చిత్రీ కరించాము. కెమెరామెన్ రవిగారు హీరోయిన్స్ ను చాల అందంగా చూపించారు. శయక్ పార్వీజ్ గారు అద్భుతమైన సంగీతాన్నిఅందించారు అని చెప్పడం జరిగింది.

నిర్మాత సి హెచ్ రాంబాబు మాట్లాడుతూ … ఈ చిత్రాన్ని అందరూ కొత్తవారితో నిర్మించాము. అలాగే  దర్శకుడు ప్రసాద్ ఎప్పటినుంచో నామిత్రుడు తక్కువ బడ్జెట్ లో కథ రెడీ చేసాడు. మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్ కు గురి కాపాడుతున్నారో..అనే మంచి మెసేజ్ ఉన్న చిత్రం కావడంతో నేనే నిర్మిస్తాను అని చెప్పడం జరిగింది. నటీనటులు కొత్తవారైనా చాలా బాగా చేసారు. కరోనా వైరస్ కారణాలవల్ల థియటర్ లేక యిబ్బంది పడుతున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. దానివలన OTT , ATT ప్లాట్ఫామ్స్ లలో అన్ని భాషలలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్నది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తున్నాము అని చెప్పారు.

హీరో; శ్యామ్, హీరోయిన్; హరిణి, నటీనటులు; హారిక, శ్రీకాంత్, నితీన్, రహీమ్ సిద్దిపేట్, సురేష్

కెమెరా: రవి బైపల్లి

సంగీతం; శయక్ పార్వీజ్

ఎడిటర్: జెమా

మాటలు: సుదర్శన్

ఆర్ట్ :వాసు

మేకప్: కుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి ప్రసాద్

సమర్పణ: బేబీ తనిష్క,జ్యోషిక

నిర్మాత:  చిక్కవరపు రాంబాబు.