Reading Time: 2 mins

ప్రజాకవి కాళోజీ చిత్రం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులు

“ప్రజాకవి కాళోజీ” సినిమాకు ఇప్పటికే 7 ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులు……

జైనీ క్రియేషన్స్ పతాకంపై, ఇప్పటి వరకు  ”అమ్మా!  నీకు వందనం”,  “క్యాంపస్ అంపశయ్య'”,  “ప్రణయ వీధుల్లో’ పోరాడే ప్రిన్స్ “, వంటి  ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో అదే బ్యానర్లో శ్రీమతి విజయలక్ష్మీ  జైనీ నిర్మించిన చిత్రం  ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన ప్రతీ చోట విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా

ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2024 లో ఫీచర్ ఫిక్షన్ కేటగిరిలో స్పెషల్ జ్యురీ అవార్డు,

కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 లో రెండు అవార్డులు

బెస్ట్ డైరెక్టర్ అవార్డు

బెస్ట్ యాక్టర్ అవార్డ్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్  2024 (జె ఐ యఫ్ యఫ్) లో బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ అవార్డు

ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్  2024 లో మార్చి 30 న బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు

రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , 2024 లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ రీజనల్, తెలుగు అవార్డు

కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , 2023 లో  బెస్ట్ డైరెక్టర్ అవార్డు

..ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్, 2024 కు బెస్ట్ బయోపిక్ మూవీ అవార్డ్  లభించాయి…

పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జీవిత విశేషాలతో నిర్మించిన బయోపిక్ చిత్రం గురించి చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. ఇందులోని నాలుగు పాటలు కాళోజీ గారి ఔన్నత్యాన్ని పెంచే విధంగా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. మొదట్లో ఈ చిత్రం అందరి విమర్శలు ఎదుర్కున్నా, చివరికి నా కృషి ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది , ఇందులో ముఖ్య పాత్రలలో నటించిన మూలవిరాట్ (అశోక్ రెడ్డి), పీవీ మనోహర్ రావు గారు, పద్మ, మల్లిఖార్జున్, నరేష్, రజని మొదలైన వారు అద్భుతమైన నటన ప్రదర్శించారని డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ జైనీ కొనియాడారు.

సంగీతం సూరంపూడి శ్రీధర్, కెమెరా స్వర్గీయ రవికుమార్ నీర్ల.